29, జులై 2023, శనివారం

ఈశ్వర నక్షత్రమాల

 ఓం నమః శివాయ


ఈశ్వర నక్షత్రమాల


శ్రీగిరినాధ ! భక్త జన సేవితపాద ! దయాంతరంగ ! యో యాగమవంద్య ! కామహర! యార్తజనావన ! నాగభూష ! ని న్నే గతిఁ గొల్చువాడ? నిఁక నెవ్వరి వేడఁగఁజాలఁగావునన్ సాగిలి మ్రొక్కుచున్ననను జయ్యనఁగావఁగరమ్ము ! ఈశ్వరా !


1


శంకర ! నిన్నుదల్చెదను, సంశయమించుకలేకయాత్మలో సంకటముల్ హరించి కడు సౌఖ్యము గూర్పఁగ రమ్మటంచు, నో పంకజనాభమిత్ర! నను బాలనసేయఁగ జాలమేల? నీ యంకమునందుఁజేర్చికొని యాదరమొప్పఁగఁగావు మీశ్వరా ! 2


నిరతము నీదు పూజలును, నిత్యము నీదగు నామకీర్తనల్ అరమరలేక యెల్లప్పుడు నార్తజనావన! నీదు ధ్యానముల్, సరగున సల్పు వారికిని సద్దతులొందునటంచు నెంచి, నీ చరణము లాశ్రయించితిని, చయ్యనఁబ్రోవఁగరాదె? ఈశ్వరా! 3


కాటికిఁగాళ్ళు సాచినను గామపు వాంఛలు తగ్గబోవు, నా నాటికిఁబెంపుజేసినను నాశముగాదిల నర్ధతృష్ణ, యే నాటికి నంతమెందదు మనంబుఁన దుచ్ఛసుఖాభిలాష, యీ పాటికిఁజాలు, కోరికలపట్ల విరక్తునిజేయు మీశ్వరా !


:8:

కామెంట్‌లు లేవు: