29, జులై 2023, శనివారం

సమస్యలు - భగవద్గీత

 ❓ _*మన సమస్యలు - భగవద్గీత పరిష్కారాలు*_ ✅ *సమస్య 84:*

✍️ Prof. S.B. రఘునాథాచార్య

🙏🌹🌼🌹🌼🕉️🌹🌼🌹🌼🙏


❓ _*సమస్య 84:*_


_*లోకంలో అందఱు ఒకే లక్షణాలు, అర్హతలు కలవారై ఉండరు కదా! అందఱికి భగవంతుణ్ణి చేరాలంటే వారికి వారికి తగినట్లు ఏవైనా మార్గాంతరాలున్నాయా? ఎలా భక్తులు భగవంతుణ్ణి చేరాలి?*_

☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆


✅👉 _*పరిష్కారం:*_ 💐

💐 *అధ్యాయం 12 - శ్లోకములు 8, 9, 10 & 11*


_*మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ!*_ 

_*నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః*_  


💐 *నాయందే మనస్సును నిలుపుము. నాయందే బుద్దిని లగ్నముచేయుము. పిమ్మట నాయందే స్థిరముగానుందువు. ఇందు ఏ మాత్రమూ సందేహమునకు తావులేదు.*


_*అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్!*_ 

_*అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ!!*_


💐 *మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జునా! అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము.*


_*అభ్యాసేప్యసమర్ధో౬సి మత్కర్మపరమో భవ!*_

_*మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి!!*_


💐 *అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుటద్వారాకూడ నన్నే పొందెదవు.*


_*అధైతదప్యశక్తో౬సి కర్తుం మద్యోగమాశ్రితః!*_

_*సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్!!*_


💐 *మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని, సకల కర్మఫలములను త్యజింపుము.*

☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆


🌹 ఏ పనికైనా ఆయా వ్యక్తుల అధికారాల్ని బట్టి మార్గం ఉంటుంది. అధికారమంటే అతడి అర్హత. అందఱికి ఒకే మార్గం అంటూ ఉండదు. వారి వారి అర్హతను బట్టి మార్గాలుంటాయి. ఇందులో...

🌹 *మొదటి మార్గం:* 'మనస్సుమ ఎల్లప్పుడు భగవంతునిపైన ఉంచడం. మనకు ప్రతి క్షణం కలిగే జ్ఞానాలను భగవత్పరంగా చేయడం. అలా చేయగలిగితే మనం భగవంతునిలోనే నివసిస్తాం. ఏమీ సందేహపడవలసిన పనిలేదు. 


🌹 *రెండవ మార్గం:* 

ఎప్పుడూ మనస్సును ఆయనపైనే ఉంచడానికి నీకు సమర్థత లేకపోతే, అభ్యాసయోగంతో దేవుణ్ణి పొందాలని ఎప్పుడూ కోరుకో. 


🌹 *మూడవమార్గం:* 

అలా భగవంతుణ్ణి పొందాలని మనశ్చాంచల్యం వల్ల కోరలేకపోతే దేవుని కోసం, ఆయన ఆరాధన కోసం ప్రతి పనినీ ఆయనకు అంకితం చెయ్యి. స్వామి కోసం కొన్ని కర్మలు చేసినప్పటికి నీకు సిద్ధి లభిస్తుంది. 


🌹 *నాల్గవవ మార్గం:*  

అలా భగవత్పరమైన కర్మలు చేయటానికి కూడా నీకు శక్తిలేకపోతే, భగవంతుణ్ణాశ్రయించి, ఇంద్రియ మనోనిగ్రహంతో నీవు నిత్యంచేసే కర్మల ఫలాన్ని ఆయనకు త్యాగం చెయ్యి. ఈ చివరి మార్గానికి అందరూ అధికారులే. వారి వారి పనులు వారు చేసుకోవచ్చు. ఫలాన్ని భగవంతునికి వదిలివేస్తే చాలు. క్రమంగా వారికి మనోనైర్మల్యం కలుగుతుంది. దీనికి మనోనిగ్రహం కావాలి. వీటిల్లో దేన్ని ఆశ్రయించినా మోక్షం వస్తుంది.


☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆


🙏 *"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన"*🙏


🙏 _*కృష్ణం వందే జగద్గురుమ్‌*_ 💐

                         

(రేపు మరొక సమస్య-సమాధానం)


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*

🚩 *హిందువునని గర్వించు*

🚩 *హిందువుగా జీవించు*


*సేకరణ:* 

🙏🌹🌼🌹🌼🕉️🌹🌼🌹🌼🙏

కామెంట్‌లు లేవు: