9, జులై 2023, ఆదివారం

కటపయాది


 కటపయాది పట్టిక (మిగిలిన వివరాలు కింది సందేశంలో)


పంచాంగంలో తారాబలం చూసుకునేందుకు ఒక పట్టిక ఉంటుంది కదా, జన్మతార నుండి పరమమిత్ర తార వరకూ, నక్షత్రాన్ని బట్టి. అలాగే  అక్షరాలకు కొన్ని సంఖ్యలను కేటాయించి పెట్టారు మన పూర్వీకులు, భారతీయ శాస్త్రజ్ఞులు. దాన్ని *కటపయాది*  పద్ధతి అన్నారు.


మనం చిన్నప్పుడు రాహుకాలం ఏ రోజు ఏ సమయానికి వస్తుందో తెలుసుకొనేందుకు ఇంగ్లీష్ లో *Mother saw father.....* అని నేర్చుకొన్నట్టు సంఖ్యలను, పదాలద్వారానూ, శ్లోకాల ద్వారానూ సులువుగా గుర్తుపెట్టుకోవడానికి వాడిన ఒక ప్రాచీన భారతీయ విధానం, కటపయాది పద్ధతి. కొన్ని అక్షరాలకు ఒకే లేదా వేర్వేరు అంకెలను కేటాయించి, మరికొన్నిటి విలువని సున్నాగా నిర్ణయించి, అర్థవంతమైన పదాలను సృష్టించి, తద్వారా సంక్లిష్టమైన సంఖ్యలను గుర్తుపెట్టుకోగలగడం, ఈ కటపయాది యొక్క ప్రత్యేకత.

శంకరవర్మ వ్రాసిన సద్రత్నమాల లోని ఈ క్రింది శ్లోకం, ఈ పద్ధతిని వివరిస్తుంది.


నజ్ఞావచశ్చ శూన్యాని సంఖ్యా: కటపయాదయ:|

మిశ్రే తూపాన్త్యహల్ సంఖ్యా న చ చిన్త్యో హలస్వర:||


అనగా, 'న', 'ఞ', , అచ్చులకు "సున్న" విలువ ఇవ్వబడుతుంది. కటపయతో మొదలు అన్ని హల్లులకు 1-9 వరకూ విలువలివ్వబడ్డాయి. సంయుక్త అక్షరాలు (వత్తులతో సహా) వచ్చినపుడు, వెనుక వచ్చిన హల్లుని మాత్రమే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పొల్లు అక్షరాలను విడిచిపెట్టాలి.


ఈ విధంగా కటపయాది పద్ధతిలో చూచినపుడు షకటప కు కుడినుంచి ఎడమకు 1116 వస్తుంది. అంటే 1116 అని అర్థం. పూర్వం శ్రీ వేదం వెంకట్రాయ శాస్త్రి గారు అను ప్రసిద్ధ సాహిత్యవేత్తకు *షకటప* అంటే 1116.00 ఒసంగడం ఓ గర్వకారణమైన సంఘటన.

కామెంట్‌లు లేవు: