3, జులై 2023, సోమవారం

ఈ రోజు పదమ:

 209వ రోజు: (ఇందు వారము) 03-07-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదమ:

పెంపుడు కొడుకు: పరిష్కంద్రుడు, పరిష్కణ్ణుడు. 

ఆడబిడ్డ కొడుకు: నానాంద్రుడు, దహోత్రుడు. 

తల్లి సోదరి కొడుకు: మాతృష్యసేయుడు, మాతృష్యస్రీయుఠు. 

సవతి తల్లి కొడుకు: అన్యమాతృజుడు, వైమాత్రుడు, వైమాత్రేయుడు. 


 ఈ రోజు పద్యము:


 అడిగినయట్టి యాచకుల ఆశ లెరుంగక లోభవర్తియై/

కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వానికె/

య్యడల; అదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్/

కుడువగ నీనిచో కెరలి గోవులు తన్నును గాక భాస్కరా!


ఓ భాస్కరా! దూడలను తాగనియ్యక పాలు తీసుకోవాలని సిద్దపడితే ఆవులు పాలియ్యవు సరికదా తంతాయి. అలాగే ఏదో ఇస్తారని ఆశతో వచ్చి చేయిచాపి అడిగే వారికి లోభితనముతో లేదు పొమ్మంటే ధర్మదేవత ఆ లోభికి ధనం ఎప్పటికీ రాకుండా చేస్తుంది.అడిగిన వారికి ఎంతోకొంత ఇస్తూ ఉంటే ధనం ఎదోవిధంగా వస్తూ ఉంటుంది. కావున యాచించే వారిని చులకనగా చూచి "లేదు పో" అని అనరాదు.

కామెంట్‌లు లేవు: