20, ఆగస్టు 2023, ఆదివారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 16*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 16*


సాహిత్యంలో కూడా నరేంద్రుడు ఎంతో ఆసక్తి చూపారు. సంస్కృతం, బెంగాలి, ఆంగ్లాలలోని కావ్యాలను చదివాడు. బెంగాలీ రామాయణ మహాభారతలు అతడికి కరతలామలకం. పండితులు తడబడిన అనేక సందర్భాలలో నరేంద్రుడు వారికి చేయూతనిచ్చాడు.


ఆంగ్లంలో షేక్స్పియర్  మిల్టన్  బైరన్  వర్డ్సవర్త్ ప్రభృతులను అతడు మరీ ఇష్టపడి చదివాడు. షేక్స్పియర్ Romeo and juliet,midsummar night's dream లాంటి నాటకాల నుండి ఆయన కాలాంతరంలో తన ప్రసంగాలలో పలు ఉదాహరణలు ఉటంకించారు. మిల్టన్ Paradise Lost నరేంద్రుణ్ణి బాగా ఆకట్టుకొన్న కావ్యం. "ఉన్న పాపం ఒక్కటే - దౌర్బల్యమే అది. 


నేను బాల్యంలో మిల్టన్ రచించిన 'ప్యారడైజ్ లాస్ట్' కావ్యం చదివాను. అందులో నా పూజ్యభా

వాన్ని చూరగొన్న సత్పురుషుడు సైతాను. దౌర్బల్యానికి వశుడు కాక, దేనినైనా ఎదుర్కొంటూ చివరిదాక పట్టువిడవని వ్యక్తే మహాత్ముడని కాలాంతరంలో తన గీతోపన్యాసాలలో ఆయన ఉదాహరించడం చూడవచ్చు.


 ఇన్ని పుస్తకాలను ఒక వ్యక్తి స్వల్పకాలంలో చదివి ఉండడం సాధ్యమా అనే సంశయం రాకపోదు. కాని నరేంద్రుని చదివే విధమే చిత్రమైనదనే సంగతి మనం మరచిపోకూడదు. తాను చదివే తీరును ఆయనే ఇలా వివరించి ఉన్నారు: 'ప్రతి పంక్తిని చదవకుండా పేరాలోని మొదటి, చివరి పంక్తులు మాత్రమే చదవగానే సారాంశం అంతా నేను అవగతం చేసుకోగలుగుతాను. ఈ ప్రతిభ ఇనుమడించే కొద్దీ పేరాలు చదివే శ్రమ కూడా లేకపోయింది. 

 

పుటలోని మొదటి, చివరి పంక్తి చదివినంత మాత్రానే సారాంశాన్నంతా గ్రహించగలిగేవాణ్ణి, ఉపాధ్యా యుడు ఏదైనా క్రొత్త భావనను పరిచయం చేస్తున్నప్పుడు దానిని నాలుగైదు పుటలలో విపులీకరించేవాడు. దాన్లోనూ మొదటి కొన్ని పంక్తులు చదవగానే అంతా అర్థం చేసుకోగలిగేవాణ్ణి" ఈ రీతిలో చదవడం కారణంగానే ఆయన స్వల్పకాలంలో అన్ని పుస్తకాలు చదవగలిగాడు🙏

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: