27, ఆగస్టు 2023, ఆదివారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 23*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 23*


సన్యాస జీవితం కేవలం మార్గం మాత్రమే; సాధించవలసిన లక్ష్యం కాదు. గృహస్థ జీవితం నీటి ప్రవాహంతోబాటే వెళ్లడంలా భావిస్తే, సన్న్యాస జీవితం దానికి ఎదురీత లాంటిది. అర్హుడైన వ్యక్తి సహాయం లేకుండా ఇందులో విజయం సాధించడం ఎంతో అరుదు. ఆ వ్యక్తినే మన శాస్త్రాలు గురువు అని పేర్కొంటున్నాయి. ఆయన సత్యాన్ని గ్రహించిన వాడై ఉండాలి; 


'సత్య సాక్షాత్కారం పొందాను' అని చెప్పగల వ్యక్తే ప్రస్తుతం నరేంద్రునికి అవసరమయ్యాడు. కనుక సర్వజ్ఞులూ, తత్త్వవేత్తలూ, మహాత్ములూ అని ఎవరిని గురించి విన్నా వారిని వెళ్లి కలుసుకొని ఈ ప్రశ్నలు అడగడం అతడికి నిత్యకృత్యమైంది.


ఈ ప్రశ్నతో నరేంద్రుడు కొట్టుమిట్టాడుతున్న సమయంలో నరేంద్రుని ప్రయత్నం ఫలించే తరుణం రానేవచ్చింది. నరేంద్రుడు అప్పుడు ఎఫ్.ఏ. చదువుతున్నాడు. ఉపాధ్యాయుడు సెలవులో ఉండడం వలన, కళాశాల అధ్యక్షుడైన విలియం హేస్టీ తీసుకొన్నాడు. వర్డ్స్ వర్త్ రచించిన Excursion అనే కవిత నాటి పాఠ్యాంశం. అందులో పార్యవశ్య స్థితిని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించడం.


హేస్టికి ఠక్కున ఒక ఆలోచన స్ఫురించింది. పారవశ్య స్థితిని ఆయన పొందకపోవడం నిజమే. కాని పారవశ్య స్థితిని పదేపదే అనుభూతం చేసుకొంటున్న ఒక వ్యక్తిని గురించి ఆయనకు తెలుసు. ఆ వ్యక్తి శ్రీరామకృష్ణ పరమ హంస. వెంటనే హేస్టీ, విద్యార్థులతో, "ఈ అనుభూతి అపూర్వమైనది, ప్రత్యేకించి ఈ ఆధునిక కాలంలో మరీ అరుదు. 


మానసిక పవిత్రత, ఏకాగ్రత, దీర్ఘకాల అభ్యాస పర్యవసానంగా లభించే ఆనందానుభూతి అది. ఆ అద్భుత అనుభూతిని పొందిన ఒక వ్యక్తిని నేను చూసివున్నాను. దక్షిణేశ్వరంలో వసిస్తున్న శ్రీరామకృష్ణ పరమహంసే ఆయన! మీరు కూడా ఆయనను దర్శించుకొంటే పారవశ్యం అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు" అని చెప్పాడు.


నిజమైన ప్రయత్నం ఎన్నటికీ వృథాకాదు కదా!

తన హృదయ తంత్రులను ఎవరో మీటినట్లు నరేంద్రునికి అనిపించింది. అంధకారం ఆవరించివున్న గదిలో దిక్కుతోచని వ్యక్తికి సన్నని రంధ్రం గుండా ఒక కాంతి కిరణం ప్రసరించి దారి చూసినట్లుగా అతడికి స్ఫురించింది!🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: