4, ఆగస్టు 2023, శుక్రవారం

పంచాంగం

 🌹🌹🌹🌹🌹

నేటి పంచాంగం 


🕉️🔯🕉️

🙏🏻సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻


🌹🙏నోముకి వ్రతానికి తేడా ఏమిటి....???? ?



భగవంతుని పూజించడానికి అనేకానేక మార్గాలలో నోము , వ్రతము లు అనేవి ముఖ్యము గా స్త్రీలు పాటించేవాటిలో సాధారణమైన భక్తి విధానాలు . భగవంతుడు - దేవుడు అనేది మానవుని నమ్మకము . 


దండము పెట్టి దక్షిణ ఇస్తే చేసే పాపాలు పోయి పుణ్యము వస్తుందంటే నవీనకాలము లో శాస్ర ప్రరంగా నమ్మకము కుదరడలేదు . ఏది ఏమైనా మన ప్రాచీన గ్రంధాలు లలో ఉన్న ప్రకారము .... 


నోము : 


మనస్సుని కేవలము భగవంతుని పైనే లగ్నము చేసి స్వామిని పూజించి ధ్యానము చేసేది - నోము . ఉదా:శ్రావణమంగళవారం నోము , అట్లతద్ది నోము . నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. 


స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. 


ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు. 


ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. 


వ్రతము :


అత్యంత నియం నిష్టలతో మంత్రోచ్చాటనలతో ధూపదీప నైవేద్యాలతో భగవతుని (దేవుని లేదా దేవతను )సేవించేది వ్రతము . వ్రతము ... అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. 


సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. నియమ-నిబంధనలతో ఉపవాసము తో చేసే పూజ లేక అరాధన . 


వ్రతము లో సంకల్పము , దీక్ష , కథాపఠనము తప్పనిసరి . వ్రతము చేయుటవలన సమస్త పాపములు పోయి ... 


పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి , సర్వ సౌభాగ్యములు కలుగును. ఉదా: వరలక్ష్మీ వ్రతం. సావిత్రీ వ్రతం. గౌరీ వ్రతం. మున్నగునవి ...స్వస్తి..


సేకరణ

కామెంట్‌లు లేవు: