14, సెప్టెంబర్ 2023, గురువారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 38*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 38*


*శ్రీరామకృష్ణ నరేంద్రుల సంబంధం*


శ్రీరామకృష్ణుల ఆక్రందన ప్రకృతి అంతటా మౌనంగా ప్రతిధ్వనించింది.  కాల ఆవశ్యకతను ఎరిగిన  కాళికాదేవి ఒకరి తరువాత ఒకరిగా శిష్యులను పంపసాగింది. కాని ఎవరైనా 'ఆ ' ఒక్కరి'కి సాటి అవుతారా? తానే స్వయంగా వెళ్లి మౌన తపం నుండి తోడ్కొని వచ్చిన ఋషి కాగలరా? ఆతడు ఇంకా రాలేదే అని శ్రీరామకృష్ణులు పరితపించారు. ఆ ఋషియైన నరేంద్రుడు ఏతెంచాడు. ఇక తమ సందేశ బీజాలను అతడి మీద చిలకరించాలి. ఆ ప్రయత్నంలో ఆయన  నిమగ్నమయ్యారు.


నరేంద్రుణ్ణి చూడగానే, "ఇతడు నా కుమారుడు, మిత్రుడు, నా ఆదేశాన్ని శిరసావహించడానికి జన్మించినవాడు, ఎన్నటికీ విడివడని ప్రేమపాశంతో నాతో పాటు అల్లుకుపోయినవాడు" అని శ్రీరామకృష్ణులు గుర్తించారు. శతాబ్దాలుగా సనాతన ధర్మానికి పట్టిన మలినాన్ని తొలగించి, దానిని కాలానుగుణ్యమైన ఒక జీవన విధానంగా మార్చి, సత్యయుగాన్ని స్థాపించే మహత్కార్యం జగజ్జనని తమకు అప్పగించింది; ఆ కార్యంలో తోడ్పడడానికే నరేంద్రుడు జన్మించాడని ఆయనకు దివ్యదర్శనాల ద్వారా తెలియవచ్చింది. ఆ నిజాన్ని ఆయన తన పరిశోధనల మూలంగా ధ్రువీకరించుకొన్నారు. తదనంతరం ఎనలేని ఆప్యాయతతోనూ, విశ్వాసంతోనూ నరేంద్రుడితో శాశ్వత బంధం ఏర్పరచుకున్నారు.


ఆ తరువాత నరేంద్రునికి అనేక రీతుల్లో శిక్షణనిచ్చి, ఆ ఉన్నత లక్ష్యసాధనకి ఉపయోగపడే పరికరంగా అతణ్ణి రూపొందించారు. శిక్షణ పూర్తయి, సంసిద్ధంగా ఉన్న నరేంద్రునికి సత్యయుగ స్థాపన మహత్కార్యంలో ఎలా పాలుపంచుకోవాలో ఉపదేశించారు. పిదప ఆ కార్యాన్నీ, బాధ్యతనూ అతడికి అప్పగించారు.


శ్రీరామకృష్ణ - నరేంద్రుల ప్రథమ సమావేశానంతరం శ్రీరామకృష్ణులు దాదాపు ఐదేండ్లు జీవించారు. ప్రారంభంలో నరేంద్రుడు ప్రతి వారమూ ఒకటి  రెండుసార్లు దక్షిణేశ్వరానికి తప్పక వెళ్లేవాడు. కొన్ని సమయాల్లో రాత్రుళ్లు కూడా అతడు అక్కడే బసచేయడం కద్దు. వరుసగా కొన్ని రోజులు అతడు దక్షిణేశ్వరానికి పోకపోతే శ్రీరామకృష్ణులు తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు. వచ్చేపోయేవారందరినీ నరేంద్రుణ్ణి గురించి వాకబు చేసేవారు, అతణ్ణి దక్షిణేశ్వరానికి రమ్మని చెప్పమనేవారు; విలపిస్తూ జగజ్జననిని ప్రార్థించేవారు. రాత్రిళ్లు నిద్ర మానుకొని అతణ్ణి గురించి ఆలోచించేవారు. "శ్రీరామకృష్ణులకు నా పట్ల గల ప్రేమే నన్ను ఆయనతో పెనవేసింది" అని కాలాంతరంలో నరేంద్రుడు చెప్పడం కద్దు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: