2, సెప్టెంబర్ 2023, శనివారం

శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం భాగం 7/12

 .   



ॐ    శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

                    భాగం 7/12

                 

( ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                ----------------------- 


          6. గణిత శాస్త్రం 


      మానవజీవితంలో గణన అనేది అతి ముఖ్యమైనది. గణితం అనేది ఒక శాస్త్రంగా అందఱికీ తెలిసిన విషయమే కదా! 


I. గణనం - సంఖ్యా శాస్త్రం 


      ద్రవ్యరాశి, పొడుగు, కాలాలకి సంబంధించి వివిధ మానాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం. వీటన్నిటికీ మౌలికంగా అంకెలు ప్రధానమైనవి.

      ఏవి గణించాలన్నా అవుసరమయ్యేవి సున్న నుంచి తొమ్మిది వరకు గల అంకెలు. 

      ఆ సంఖ్యలకి సంబంధించి 

 - లక్షలు - కోట్లు అని ఒక విధంగా లెక్కపెడితే,

 - మిలియన్లు - బిలియన్లు - ట్రిలియన్లు అనే మరొక పద్ధతిలో మరొక విధంగా లెక్కపెడతాము. 


      శ్రీమద్వాల్మీకి రామాయణంలో వివిధ  దేశాలలో వివిధ సంఖ్యామానాలు, దీనికి దాదాపు భంగం కలుగకుండా కనిపిస్తాయి. 


సుగ్రీవుడు చెప్పిన లెక్కింపు 


      సుగ్రీవుడు తన వద్దకు చేరుకునే వానరుల సంఖ్య శ్రీరామునికి వివరించాడు. 

      దానిలో 

   - వందమంది 

   - లక్ష 

   - కోటి 

   - అయుతము 

   - శంకువు 

   - అర్బుదము 

   - నూరు అర్బుదములు 

   - మధ్య 

   - అంతము అనే సంఖ్యలతో లెక్కపెట్టేంతమంది వానరులు నాయకులతో దారిలో వస్తున్నారని తెలిపాడు. 

      సముద్ర 

    - పరార్థ సంఖ్యలలోఉన్న వానరులు తనవద్దకు చేరుకుంటున్నారని చెప్పాడు. 


లంకలో 


      రావణుని గూఢచారులైన శుకసారణులు, ఇదే వానర సైన్యాన్ని చూసి, రావణునికి వివరించారు. 

      లక్ష కోట్లు ఒక శంఖము అనీ, 

      లక్ష శంఖములు ఒక మహా శంఖమనీ, 

      లక్ష మహా శంఖములు ఒక బృందమనీ, 

      లక్ష బృందముల ఒక మహా బృందమనీ, 

      లక్ష మహా బృందములు ఒక పద్మమనీ, 

      లక్ష పద్మములు ఒక మహా పద్మమనీ, 

      లక్ష మహా పద్మములు ఒక ఖర్వమనీ, 

      లక్ష ఖర్వములు ఒక మహా ఖర్వమనీ, 

      లక్ష మహా ఖర్వములు ఒక సముద్రమనీ, 

      లక్ష సముద్రములు ఒక ఓఘమనీ, 

      లక్ష ఓఘములు ఒక మహౌఘమనీ వివరిస్తూ లెక్క చెప్పారు.  

      ఈ విధంగా సుగ్రీవ సైన్యాన్ని వారి మానంలోకి మార్చి రావణునికి తెలిపారు. 


      జ్యోతిష్య శాస్త్రంలో ఏకం దశ శతంత్వస్మాత్ సహస్రమ్ .... అని తెలిపిన విధంగా ఒకటి నుంచి పరార్థము అనేవి సంఖ్యలుగా ఒకదానికన్న దాని తరువాతది పదిరెట్లు ఉండే విధంగా పేర్లు చెప్పబడ్డాయి. 


      వివిధ దేశాలలో వివిధ సంఖ్యామానాలు మౌలికంగా ఉండి, పరివర్తనకి వీలైనవిగా ఉండడం ఆదర్శం కదా! 


II. అశ్వమేథ యాగం - శుల్బ సూత్రం 


    దశరథుడు చేసిన ఈ యాగంలో 

(i) ఏ ఏ వృక్షాల చెక్క స్తంభాలు - ఎన్నెన్ని తీసుకొని, 

     ఆ స్తంభాల అంచులు ఎన్నెన్ని ఉంచారో, 

     ఆ యూప స్తంభాలమధ్య ఎంతెంత దూరం ఉంచబడిందో, 

(ii) శుల్బకర్మయందు నిపుణులతో అగ్నివేదికల నిర్మాణం, 

(iii) ఇతర వేదికలకంటే మూడురెట్ల ఇటికలు ఎక్కువగా ఉంచి కట్టడం వంటి గణిత సంబంధమైన విషయాలు కనిపిస్తాయి. 

* వీటిలో శుల్బం సహాయంతోనే జ్యామితి {జ్యా = భూమి, మితి = కొలత) చేసి వేదికలు కట్టబడ్డాయి. 

   ఈ శుల్బానికి సంబంధించిన 

    "భుజకోటి వర్గైక్య మూలం కర్ణ మూలః" అనేదే, ప్రస్తుతం మనం చదువుకొనే "పైథాగరస్" సిద్ధాన్తం. 


III. పాయస పంపకం 


    పుత్రకామేష్టి ద్వారా వచ్చిన పాయసాన్ని, దశరథుడు 

  - సగభాగం (1/2) కౌసల్యకీ, 

  - మిగిలిన సగం (1/2) లో సగం (1/4) సుమిత్రకీ, 

  - ఆ మిగిలిన (1/4) పావులో సగం (1/8) కైకేయికీ, 

  - మిగిలిన (1/8) ఎనిమిదో వంతుని మళ్ళీ సుమిత్రకీ ఇచ్చాడు. 

    ఆయా భాగాలకి చెందిన విధంగా రామ - భరత - లక్ష్మణ, శత్రుఘ్నులు జననం జరిగింది. 

    అది ఆధునిక గణితంలో Probability Distribution theoryగా చదువుతారు. 


    ఈ ఉదాహరణల ద్వారా, శ్రీమద్వాల్మీకి రామాయణం మన గణిత శాస్త్రానికి ఆదర్శమో తెలుస్తుంది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: