5, సెప్టెంబర్ 2023, మంగళవారం

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి💐

 *సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి💐🙏🕉️*


      *ఉపాధ్యాయ -  దినోత్సవం*

ఈరోజు తత్త్వవేత్త, విద్యావేత్త, అధ్యాపకుడు, మానవతావాది

భారతరత్న సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, ఇట్టి పవిత్ర దినమును 1962 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజు గుర్తుగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది...

ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు ఇది,

గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం సర్వేపల్లి పుట్టిన రోజైన "సెప్టెంబర్ 5" ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు...


*ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకొందాం.!!*

భారతరత్న, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు,

ఈయన 1888 సెప్టెంబరు 5 న, సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ అను తెలుగు దంపతులకు, ఒక హిందూ నియెాగి బ్రాహ్మణుల కుటుంబంలో  మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తణిలో జన్మించారు...

రాధాకృష్ణన్ తన 16వ ఏట శివకామమ్మను పెళ్లి చేసుకున్నారు...

వీరికి ఐదుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. 

కొడుకు పేరు సర్వేపల్లి గోపాల్, ఆయన బాల్యమంతా తిరుత్తణి, తిరుపతిలోనే గడిచింది...


భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు...


సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 1962 మధ్య ఉపరాష్ట్రపతిగా ఉన్నారు...


1962 నుంచి 1967 వరకు రెండో రాష్ట్రపతి...

ఆయన ఒక గొప్ప తత్వవేత్త, విద్యావేత్త, మానవతావాది...


1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు...


1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు.

చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు...


1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 

1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.


1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది... దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.


డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, లండన్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసంగం విన్న అనంతరం హెచ్ఎన్ స్పాల్డింగ్ 1936లో "ఆక్స్‌ఫర్డ్ ఫర్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్‌" లో స్థానం కల్పించారు.. 

1953 నుంచి 1952 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు...


సర్వేపల్లి గొప్ప పండితుడు, బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 

ఆయన 16సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు, మొత్తం 27సార్లు నామినేట్ అయ్యారు...

ఘనశ్యామ్ దాస్ బిర్లా తదితరులతో కలిసి రాధాకృష్ణన్ కృష్ణార్పన్ చారిటీ ట్రస్ట్‌ను స్థాపించారు...


రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్స్, రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డులు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన జ్ఢాపకార్థం ఏర్పాటు చేశారు..


*తత్వవేత్తగాసర్వేపల్లి....!!*


భారతీయ తాత్వికచింతనలో ఆయన పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి, ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం...

గురుశిష్యుల బంధానికి వారు కూడా ప్రతీకలు. 

సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు.


గురువులకు ప్రతీక వీరు, సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాలను ప్రపంచానికి సులభంగా, స్పష్టంగా చెప్పారు సర్వేపల్లి. 

ఆధునిక సమాజానికి గురువు ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన తన స్వీయచరిత్రలో వివరించారు.


మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రం లో (Philosophy), ఎమ్మే (M.A.) పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో ప్రొఫెసర్ (బోధకుడి) గా చేరారు. 

ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. 

ఆయన రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు, ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు...


కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. 

దాంతో ఆయన కలకత్తా వెళ్ళాడు, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ తత్వశాస్త్రం (Indian Philosophy)' అన్న గ్రంథం వ్రాశాడు. 

ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది, ఈయన పాశ్చాత్య తత్వవేత్తలు (Western Philosophers) ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న "వేదాంత ప్రభావానికి" ఎలా లోనవుతున్నారో చూపించారు... 

అతని దృష్టిలో "తత్వము" అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము "భారతీయ తత్వమును (Indian Philosophy) " అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు...


భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, "భారతీయ తాత్వికచింతన" ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు...

 గురుపూజోత్సవ  శుభాకాంక్షలు 🙏💐🕉️

కామెంట్‌లు లేవు: