5, సెప్టెంబర్ 2023, మంగళవారం


 👆

.      *మన నాణెం పై తెలుగు భాష.*

*(బ్రిటిష్ వాళ్లు 1936లోనే తెలుగుకు ఎలా పట్టం కట్టారో చూడండి.)*


*కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ పటేల్,*

*ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, Dr భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు.* 


*అప్పుడు, పట్టాభి సీతారామయ్య గారు ”ఆంధ్రరాష్ట్ర నిర్మాణసమస్య” ను సభ దృష్టికి తెచ్చారు.*


*"పట్టాభీ ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం..ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు.*

*అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా ‘మద్రాసీ’లు కదా?" అన్నారు గాంధీ గారు, ఎగతాళిగా!*


*వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి "అణా కాసు" ను తీసి ”గాంధీ జీ ! దీనిపై ‘ఒక అణా‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ,  హిందీలోనే కాకుండా దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ & తెలుగులోనూ ‘ఒక అణా‘ అని  రాసి ఉంది. అది కూడా, బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన నాణెం! (అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)*

*"నాణెంపై _తెలుగుభాషలో 'ఒక-అణా'_ అని  ఉంది కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే?"*

*అంటూ చురక వేశారు.*


 *గాంధీ గారితో పాటూ... కొంతమంది తెలుగు మాతృబాష కానివారు కూడా ఆశ్చర్య పోయారు.*


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

కామెంట్‌లు లేవు: