16, సెప్టెంబర్ 2023, శనివారం

ఎక్కువ పొడవుగా

 శ్లోకం:


 నాత్యన్తం సరళైర్భావ్యం గత్వా పశ్య వనస్థలీమ్ ।


ఛిద్యన్తే సరళాస్తత్ర కుబ్జాస్తిష్టన్తి పాదపాః ।।

           

         చాణక్య నీతిశాస్త్రం


పద విభాగం


న అత్యన్తం, సరళైః, భావ్యం, గత్వా, పశ్య, వనస్థలీమ్,

ఛిద్యన్తే, సరళాః, తత్ర, కుబ్జాః, తిష్టన్తి, పాదపాః,


తాత్పర్యం:


ఈ శ్లోకం చాణక్యుడి నీతి శాస్త్రం లోనిది.


మరీ ఎక్కువ పొడవుగా ఎదగడం మంచిది కాదు. అడవి ప్రదేశాలకి వెళ్ళి చూడుము. అక్కడ మరీ ఎక్కువ పొడవుగా పెరిగిన చెట్లని నరికి వేస్తున్నారు. అక్కడ పొట్టిగా మరుగుజ్జుగా పెరిగిన చెట్లన్నీ నిక్షేపంగా అలాగే ఉన్నాయి.


ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు జన బాహుళ్యానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు.


కుళ్ళు కుతంత్రాలతో నిండిన ఈ స్వార్థ పూరిత ప్రపంచంలో, మనిషి మనుగడకై దిశానిర్దేశం చేస్తున్నాడు. మరీ ఎక్కువ ఋజు వర్తనమైన ప్రవర్తనతో ఈ ప్రపంచంలో జీవించడం అనేది సాధ్యమైన పనికాదు. సంఘంలోని స్వార్ధపూరితమైన మనుషులు, దుష్ట శక్తులు అటువంటి వారికి జీవనమే కష్టసాధ్యం చేస్తారు. మనుగడే అసాధ్యమై పోతుంది. అది ఎలాగా అంటే అడవిలో నిట్ట నిటారుగా పెరిగిన చెట్లని నరికి వేసినట్టు గా.

కామెంట్‌లు లేవు: