15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

శివపార్వతులమధ్య

 శివపార్వతులమధ్య వ్యత్యాసము!



కవిసామ్రాట్ విశ్వనాధ!


11. నీవో యౌవనమూర్తి వౌదు వసురానికంబు మ్రదించు శి

క్షావైశద్యము పొల్చు నీతనువు నీశా! అన్నపూర్ణాంబికా

దేవిం జూచిన వృద్ధవోలె మదికిన్ దీపించు దాంపత్య మీ

భావం బెవ్వఁ డెఱుంగు శైలతనయా ప్రాణేశ! విశ్వేశ్వరా


ఓ విశ్వేశ్వరా! పార్వతీప్రాణనాథా!

ఈశా!

నీవా- అసురసమూహములను శిక్షించు స్పష్టతగల యౌవనము

గల శరీరముగలవాడవు.

అన్నపూర్ణమ్మతల్లియో- తలపండినవృద్ధ!అనిపించును.

మీదాంపత్య రహస్యంబెరిగినవాడెవ్వరయ్యా?!


దేవదేవుడవు.

సదాత్రిదశులకు ఆదిదేవుడవు.

యౌవనముగూడుగట్టినదొరవి.

రాక్షసశిక్షా దక‌్షుడవు. వారినిమ్రందించుబలశాలివి.

కనుక యౌవనము రూపుగట్టిన దార్ఢ్యమునీది!

ఇక అన్నపూర్ణమ్మ --

శ్రీనాథుడనినట్లు---

"వేదపురాణశాస్త్రపదవీనదవీయసియైన పెద్దముత్తైదువ!"

 యుగయుగాలుగాఎందరు జీవులకో ప్రాణదాత్రియై తలపండిన వృద్ధ!

తిలతండులన్యాయమునచెప్పదగు కేశపాశమనినాడు కవిసార్వభౌముడు!

కాశీ క్షేత్రంలో శివునికే‌అన్నభిక్ష ఇడిన మహామాత- అన్నపూర్ణాదేవి!

ఎంత వింత దంపతులుమీరు!


విశ్వేశ్వర శతకము-


రసజ్ఙభారతి సౌజన్యంతో!

కామెంట్‌లు లేవు: