21, అక్టోబర్ 2023, శనివారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 60*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 60*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*సరస్వత్యాః సూక్తీ రమృతలహరీ కౌశలహరీః*

 *పిబన్త్యా శ్శర్వాణీ శ్రవణచుళుకాభ్యా మవిరళమ్ |*

 *చమత్కారః శ్లాఘా చలితశిరసః కుండలగణో*

 *ఝణత్కారై స్తారైః ప్రతివచన మాచష్ట ఇవ తే ‖*


సరస్వత్యాః సూక్తీః = అమ్మవారి సభలో వున్న సరస్వతి (వాగ్దేవత) చెప్తున్న సూక్తులు (సు+ఉక్తము=చక్కగా చెప్పబడినది) 


అమృతలహరీ కౌశలహరీః = అమృత లహరి వలెనూ దానిని మించినదిగానూ (కౌశల్యమును హరించునది కౌశల హరి)


పిబన్త్యాః శర్వాణీ శ్రవణ చుళుకాభ్యా మవిరళమ్ = అమ్మవారు ఆ సూక్తులను విని ఉప్పొంగిపోయి, ఆ మాధుర్యమును గ్రోలుతూ, చెవులను దోసిళ్ళు పట్టి వింటున్నట్లుగా ఉందట.


చమత్కారః శ్లాఘా చలితశిరసః కుండలగణోఝణ త్కారై స్తారైః ప్రతివచన మాచష్ట ఇవ తే = తన ఆమోదమును, ఆనందమును,శ్లాఘమును ఆ చెవులే చెప్తున్నాయా అన్నట్లుగా,ఆమె తన తలను ఊపుతూ ఉండగా, చెవులకున్న కుండలములు ఝణత్కారారవములు, కింకిణీ స్వరములు పలుకుతున్నాయిట.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: