4, అక్టోబర్ 2023, బుధవారం

తరుణోపాయం

 కళ్ళు మూసి తెరిచే లోపు కాలం గిర్రున తిరిగిపోతుంది. రాజులు తరాజులవుతారు. ఓడలు బళ్ళు అవుతాయి. బాధ్యతలు చుట్టుముడతాయి. వ్యాధులు పైబడతాయి. వయసు, ఉత్సాహం ఉడిగి పోతాయి. నోటు మాటకే కానీ నోటి మాటకు విలువ ఉండదు. కాల చక్రం కరకు కోరల్లో జీవుడు ఇలా మగ్గిపోవాల్సిందేనా? తరుణోపాయం లేదా? ఉంది. భక్తి అనే తిరగలిలో విశ్వాసమనే పిడిని గట్టిగా పట్టుకుంటే నలగకుండా గట్టెక్కవచ్చు. గోవిందా అనుకో. నామం వదలకు. శరణాగతి మరువకు. ఇహానికి, పరానికి ఇదొక్కటే పెట్టుబడి. హరి ఓం./అంతరంగ తరంగం/AVR🙏

కామెంట్‌లు లేవు: