10, నవంబర్ 2023, శుక్రవారం

బాహ్యస్పృహలో లేనివారి

 *ప్ర : జీవితమంతా భగవదారాధన చేస్తూ,స్మరణ చేస్తూ మంచి పనులు చేస్తూ ఉండి,అవసాన దశలో పక్షవాతం, హృద్రోగం వంటి వ్యాధులకు లోనవ డంవల్ల బాహ్యస్పృహ కోల్పోవడం జరుగుతుంది. అట్టివారు నామ స్మరణ చేసేందుకు శరీరం, మనస్సు సహకరించని స్థితిలో వారి గతి ఏమిటి ?*


జ : "అన్తకాలే చ మామేవ స్మరన్ ముక్త్యా కలేబరం l యః ప్రయాతి సమద్భావం యాతి నాన్యత్ర సంశయః॥

- చివరి దశలో భగవత్ స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేవారు భగవత్ భావాన్ని పొందుతారని శ్రీకృష్ణ వచనం. ఇది నిజమే. కానీ బాహ్యస్పృహలో లేనివారి విషయం వేరు. జీవితమంతా భగవచ్చింతన చేసేవారు - స్పృహ ఉన్నంతవరకు చేస్తున్న కారణంగా వారికి తప్పక సద్గతి కలుగుతుంది.

" స్పృహకు అంతము కలిగే వరకు " అనే అర్థాన్నే తీసుకోవాలి.

" అన్తకాలే చ "- అనడంలో "అన్తకాల మునందు కూడా " అని అర్థం. నిత్యం స్మరించేవానికే అవసానకాలంలో స్ఫూరణకు వస్తుంది. నిత్యస్మరణం వల్ల భగవద్భావం వ్యక్తి వ్యవస్థగా మారిపోతుంది. భావన భగవన్మయమైన వాడు, బాహ్యస్పృహ లేకున్నా సద్గతి పొందుతాడు.దీనిలో సందేహం లేదు.

కామెంట్‌లు లేవు: