8, డిసెంబర్ 2023, శుక్రవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం



.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||





సాధ్వీమణీ ! నేను ఈ మాట అన్నానో లేదో పర్జన్యుడు హఠాత్తుగా వర్షించాడు. ధారాహస్తాలతో

కుండపోతగా వానకురిపించాడు. ఉరుములూ మెరుపులతో వర్షిస్తున్న మేఘాన్ని చూసి నా హృదయం

వెమలిలా పురివిప్పి నాట్యం చేసింది. ఆ గుడిసెలోనుంచి ఒక్క అంగలో ఇవతలికి వచ్చాను. పన్నెండేళ్ళ

తరవాత పడుతున్న వానలో కేరింతలు కొట్టాను.

అవర్షణే చ చౌర్యేణ యత్పాపం కథితం బుధైః !

యో న వర్షతి పర్జన్యః తత్తు తస్మై భవిష్యతి


* త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం

ప్రియాంగనా! మరి నువ్వు ఎలా కాలం గడిపావో, ఏమేమి చిత్రవిచిత్ర సంఘటనలు 

జరిగాయో చెప్పాలి. కష్టాలు గడిచిపోయాక వింతలూ విడ్డూరాలుగానే ఉంటాయి. క్రూరమృగాల

సంచరించే ఈ భయంకరారణ్యంలో ఇంతమంది పిల్లల్నివేసుకుని ఒక్కతెవూ ఎలా కాలం గడిపావు

ఎలా పోషించావు ఇంతమందినీ? అని విశ్వామిత్రుడు సానునయంగా ప్రశ్నించాడు.

ఆ ప్రియంవద మృదువుగా పలికింది. ఆకలితో అలమటిస్తున్న పిల్లల్ని బతికించుకోడానికి చాలా

తిప్పలు పడ్డాను. గుప్పెడు నీవారధాన్యంకోసం అడవి అంతా గాలించేదాన్ని. వాటితో కాసింత గంజి కా

తలో గుక్కెడూ పట్టించి కొన్ని నెలలు గడిపాను. రానురాను ఆ గింజలూ కరువయ్యాయి. బిచ్చ

ఎత్తుదామంటే వేసేవాళ్ళు ఎవరు? అందరిదీ అదే అవస్థాయె. కాయలూ దుంపలూకాదు ఆకులు

అలములూకూడా దొరకని పరిస్థితి. పెద్ద పెద్ద మహావృక్షాలు నిలువునా ఎండిపోయి మోడులై బికారులలా

నిలబడ్డాయి. ఒకప్పటి పచ్చదనం తల్చుకుంటే గుండెలు బావురుమనేవి. గంపెడు పిల్లల్ని ఎలా సాకాలో

ఎలా బతికించుకోవాలో, నా ప్రాణాలు కడబట్టకుండా ఎలా నిలుపుకోవాలో ఏమీ తోచక రేయింబవళ్ళు

విలపించినదాన్ని విలపించినట్టున్నాను. సుదూర ఆశ్రమాలనుంచీ జనపథాలనుంచీ ఆకలిచావుల వార్తలు

గుండెను పిండేసేవి. వద్దు అది తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఒక కొడుకును ఎవరికైనా అమ్మేసి

మిగిలినవాళ్ళని బతికించుకుందామని కఠోరనిర్ణయానికి వచ్చి సిగ్గువిడిచి బయలుదేరాను. అదృష్టవశాత్తు

సత్యవ్రతుడు ఎదురయ్యాడు. ఆ దయార్ద హృదయుడు ప్రతిజ్ఞచేసి రోజూ ఏదోవేళ మాంసం తెచ్చి మన

ఆశ్రమవృక్షానికి వేలాడగట్టి వెడుతూ ఉండేవాడు. ఆ మహానుభావుడే ఉపకారం చేసి ఉండకపోతే

నాథా ! ఈపాటికి మేమెవ్వళ్ళమూ నీ కంటికి కనిపించి ఉండేవాళ్ళం కాదు. మా అందరి ప్రాణాలూ

నిలబెట్టిన దయామయుడు ఆ సత్యవ్రతుడు.

కామెంట్‌లు లేవు: