28, డిసెంబర్ 2023, గురువారం

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*ప్రథమ స్కంధము*


*జలజాతాక్షుడు చూడ నొప్పె ధవళచ్ఛత్రంబుతో, చామరం*

*బులతో, పుష్పపిశంగచేలములతో, భూషామణిస్ఫీతుడై*

*నలినీబాంధవుతో, శశిద్వయముతో, నక్షత్ర సంఘంబుతో*

*బలభిచ్చాపముతో తటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్.*


నల్లనివాడు, పద్మనయనంబులవాడు అయిన శ్రీకృష్ణుడు ద్వారకలో ఊరేగింపుగా మెలమెల్లగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ కదలుతున్నాడు. పైన తెల్లని గొడుగు. అటు ఇటూ వింజామరలు. పూవులుకుట్టిన పచ్చనికాంతితో కనులపండుగ చేస్తున్న కమనీయ వస్త్రాలు. నిలువెల్లా పెక్కుతీరులైన బంగారంలో పొదిగిన వజ్రాలు వైడూర్యాలు మొదలైనవి కల నగలు. ఆహా! ఎంత మనోహరరూపం. ఆయనను చూచి పైకి అలా భావనతో చూస్తే ఒక నల్లని మేఘం. ఇక్కడి గొడుగు ఆ మేఘం మీద వెలుగుల కుప్పలతో కప్పుచున్న సూర్యుణ్ణి తలపింపజేస్తున్నది. చామరాలు రెండు చందమామలలా ఉన్నాయి. నగలు నక్షత్రాలలాగా మెరిసిపోతున్నాయి. ఆభరణాలు ఇంద్రధనుస్సులాగా విరాజిల్లుతున్నాయి. మణులు మెరుపుతీగలను స్ఫురింపజేస్తున్నాయి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: