6, డిసెంబర్ 2023, బుధవారం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 22*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*కురుంబ నాయనారు*


శివదీక్షాపరులై, విభూతిధారులై విరాజిల్లుతున్న ప్రజలతో కూడిన పెరుమిళలై అనే గ్రామంలో శివభక్తుడైన కురుంబనాయనారు

అవతరించాడు. శివభక్తులు ఏదడిగినా లేదనకుండా ఇస్తూ వాళ్లను భోజన  మజ్జనాదులతో సంతృప్తి పరుస్తుండేవాడు. శివభక్తులముందు తననొక

సేవకుడుగా భావించుకొని వినయంగా ప్రవర్తిస్తూ వచ్చాడు.


'తిరుతొండ తొగై' రచించిన సుందరమూర్తి నాయనారును సదా ధ్యానంచేస్తూ రావడం వలన కురుంబనాయనారుకు అష్టమసిద్ధులు

కైవశమైనది. శివ పంచాక్షరియే తన సర్వస్వంగా భావించి శివభక్తులకు

సేవచేయడంలో కాలం గడుపుతుండగా సుందరమూర్తి నాయనారు

కొడుంగోళూరు చేరుకున్నారు. 


వారు తిరువంజి కళంలో వెలసిన పరమేశ్వరుని ప్రస్తుతించి కైలాసాన్ని అనుగమిస్తున్నారనే విషయాన్ని తన

యోగబలంచే కురుంబ నాయనారు తెలుసుకున్నారు. “సుందరమూర్తి

నాయనారును ఎడబాసి గుడ్డివారి వలె నేను జీవనం సాగించలేను.


అందువలన యోగబలంచే ఇప్పుడే నేను కైలాసానికి వెళ్తాను” అని కురుంబ

నాయనారు నిశ్చయం చేసుకున్నాడు. తనకున్న యోగశక్తిచే బ్రహ్మరంధ్రాన్ని

తెరుచుకొని పరమేశ్వరుని తిరుచరణాల సన్నిధిని సుందరమూర్తి నాయనారు

చేరుకోవడానికి పూర్వమే తాను వెళ్లి చేరుకోగలిగాడు.


*ఇరవై రెండవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: