27, జనవరి 2024, శనివారం

- *శ్రీ రామరక్షా స్తోత్రం - 32*


💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


                  *లోకాభిరామం రణరంగధీరమ్* |

                  *రాజీవనేత్రం రఘువంశనాథమ్* ||

                  *కారుణ్యరూపం కరుణాకరం తమ్* |

                   *శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే* ||


           - *శ్రీ రామరక్షా స్తోత్రం - 32* -


మనోహరమైన రూపము గలవాడు, యుద్ధ రంగమున తిరుగు లేనివాడు, సరసిజాక్షుడు, రఘువంశ శ్రేష్ఠుడు, కారుణ్యమే రూపము దాల్చినట్లు ఉన్నవాడు, దయకు నెలవైనవాడు అయిన శ్రీరామ చంద్రుని శరణు వేడుచున్నాను. సర్వ లోకాలకు సంతోషాన్ని కలిగించేవాడు, రణం అనే క్రీడలో ధీరత్వం కలిగినవాడు, కమలములవంటి కన్నులు కలవాడు, రఘువంశ నాయకుడు, కరుణ రసం మూర్తీభవించినవాడు, అయిన శ్రీరామచంద్రుడు నాకు శరణునిచ్చుగాక. *లోకోత్తర సుందరాకారుడు, రణరంగధీరుడు, కమలనయనుడు, రఘువంశ నాయకుడు, దయాస్వరూపుడు, కరుణామూర్తి అగు శ్రీరామచంద్రుని శరణు వేడుకొందును*.


🧘‍♂️🙏🪷 ✍️🙏


 శ్రీరామరక్షా స్తోత్రము

 అనువాద పద్యము 32


రచన మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు

 మిట్టాపల్లి 


తే గీ . సుందరాకార  విగ్రహశోభితుండు

యుద్ధమందున విజయాల యోగ్యుడితడు 

కమలపత్రములనుబోలు కళ్ళు కలిగి

రాఘవుల వంశ నాయక రామచంద్ర

దయను చూపుట యందున తండ్రి యితడు

రామచంద్రుడే సర్వంబు రక్ష చేయు

కామెంట్‌లు లేవు: