16, జనవరి 2024, మంగళవారం

పండుగల శుభాకాంక్షలు*

 సంకురాత్రిమీకుసకలసౌఖ్యంబులు

సంతసములనిచ్చిచింతదీర్చి

మీకుటుంబమునకుమేలుజేయుచుసదా

సంబరములనిచ్చిసాకుగాక

        తపస్వీవిజయవాడ


*పండుగల శుభాకాంక్షలు*

సర్వశుభంబులిచ్చిపలుసంపదలిచ్చిసుఖంబులిచ్చియీ

పర్వముమీకుటుంబమునుబంధుగణంబునకీర్తిపెంచుచున్

పూర్వపుబాధతీర్చునుసమూలముగన్ యశస్సుమీ

కుర్విపయిన్ నిరంతరమునున్నతరీతులకల్గజేయుచున్


 భోగిసంక్రాంతికనుమలుముక్కనుమను

గూడిసంతోషములనిచ్చికోర్కెదీర్చి

మీకళత్రపుత్రాదులమేలుగూర్చి

కార్యములలోవిజయములుకలుగుగాక


 భార్యాపిల్లలుమీకుస

పర్యలగౌరవమునిచ్చిపరపతిపెంచున్

ధైర్యమువారైసద్గుణ

చర్యలతోమీకుసంతసంబునిడుసదా

    తపస్వీవిజయవాడ (పంతుల వెంకటేశ్వరరావు)

కందము 

అద్దమున విభుని గాంచుచు

ముద్దియ పులకింత, సిగ్గు, మురిపెము తోడన్

సుద్దులు చెప్పుచు మూసెను

దిద్దిన కాటుక కనులను తీవ్ర తమకమున్.  🙏



కందము 

సతతము వెన్నుని ధ్యానము

నతివ తన మనసున చేయ నాశ్చర్యముగా

ప్రతిబింబమ్ముగ సమ్ముఖి

నతడే యగుపడ సొలపున నందము నందెన్. 🙏



కందము 

మాధవు పతిగా పొందగ

గోదా చేసెను వ్రతమును గోవిందు రహిన్,

కాదనడు స్వామి జీవుని

వేదన, శరణమును గోరి వేడుకొనంగా. 🙏


కందము

వ్రతమును చేసెను గోదా

పతి గావలె పరమధామపతి తనకని, శ్రీ

పతి గైకొనె భూరి నెనరు

నతి లోక విభవమున మగనాలుగ ముదమున్ 🙏


ఉత్పలమాల

తాను ధరించు మాలలను తామర నేత్రుడు, రంగనాథుడే

ప్రాణ ప్రదమ్ముగా గొని వివాహమొనర్చగ నానతీయగా,

మానిని యాచరించినది మార్గళి పూజను  తాను గోపికై,

గానము చేసె మాధవుని గాథల పాటల పాశురమ్ములన్,

మానవ కోటి పాపములు మాపును పావన గాథ తల్చినన్.  🙏


ఓం శ్రీ గోదా మహా లక్ష్మై, శ్రీ రంగ నాయకై  నమః   🙏🙏🙏

ఓం నమో నారాయణాయ  🙏🙏

కామెంట్‌లు లేవు: