13, ఫిబ్రవరి 2024, మంగళవారం

మనసే ప్రధానమ్*

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*



*#మనసే ప్రధానమ్*


*మనం ఎన్ని పూజలు /మంచి పనులు చేసినా - మన మనస్సులో మార్పురాక పోతే అంతా వృథా*


పూర్వం దీని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది


1) ఒక ఊరిలోని వీధిలో ఒక వేశ్య & ఒక బ్రాహ్మణుడు ఎదురుగా ఉన్న ఇళ్లలో ఉండేవారు


2) బ్రాహ్మణుడి ఇంటికి నిరంతరం వేద పండితులు వస్తూ పోతూ ఉండేవారు

3) ఎంతో మంది వచ్చి పూజలు/యజ్ఞాలు/హోమాలు చేసుకొని వెళుతూ ఉండేవారు

4) ఆ వేశ్య నిరంతరం వీటి మీద ధ్యాస పెడుతూ ,ఆలోచిస్తూ ఉండేది

5) బ్రాహ్మణుడు ఎంత చక్కగా పూజలు చేస్తున్నాడు , నేను కూడా అలా చేస్తే బాగుండేది అని


6) ఆ వేశ్య ఇంటికి నిరంతరం ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవారు

7) ప్రతీ రోజూ ఏదో ఒక వినోద కార్యక్రమం జరుగుతూ ఎంతో ఆహ్లాదంగా /సందడిగా ఆ వేశ్య ఇల్లు ఉండేది

8) ఆ బ్రాహ్మణుడు నిరంతరం వీటి మీద ధ్యాస పెడుతూ ,ఆలోచిస్తూ ఉండేవాడు

9) ఆ వేశ్య ఇంటికి ఎవరు వస్తున్నారు , ఏం జరుగుతోంది అని మనసులో అనుకుంటూ ఉండే వాడు


10) ఒక రోజు ఇద్దరూ ఒకే రోజు మరణించారు

11) యమభటులు వచ్చి బ్రాహ్మణుడిని తీసుకువెళుతున్నారు

12) విష్ణుభటులు వచ్చి ఆ వేశ్యను స్వర్గానికి తీసుకువెళుతున్నారు


13) ఆ బ్రాహ్మణుడు పొరపాటున తారు మారు అయ్యింది - నేను స్వర్గానికి వెళ్ళాలి & ఆ వేశ్య నరకానికి వెళ్ళాలి అని అంటాడు

14) అప్పుడు ఆ యమభటులు అంటారు - నీ మనస్సు నిరంతరం ఆ వేశ్య ఇంటి పై ఉన్నది కాబట్టి నీకు నరకలోకం 

15) ఆ వేశ్య మనసు నిరంతరం పూజలు /యజ్ఞాల మీద ఉన్నది కనుక ఆమెకు స్వర్గలోకం అని వివరణ ఇచ్చారు


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కామెంట్‌లు లేవు: