14, మార్చి 2024, గురువారం

వేమన పద్యములు🌹*

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 54*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 157*


*అన్నమన్న మనుచు నరుతురు మూఢులు* 

*యాయువొంది నప్పు డన్నమేల ?*

*నన్న మేలలేదు యాయువుబొందిన*

*యెన్ని కరువులైన యిలను వేమా !*


*🌹తాత్పర్యము --*

అన్నమో రామచంద్రా అని మూఢులు అరుస్తూ ఉంటారు.

ఆయుర్దాయముంటేనే గదా అన్నము మీద ధ్యాసమళ్లును.

ఎన్ని కరువు కాటకాలు వచ్చినా ఆయువు ఉన్నచో ఏదో ఒకటి తిని కాలము గడుపవచ్చును.


*💥వేమన పద్యాలు -- 158*


*అన్నమునకు నంటు యయిన నాత్మకునంటు* 

*యాత్మను పెనగొన్న యన్నమంటు*

*యాత్మ శుద్ధియన్న మన్నశుద్ధియు నాత్మ*

*మిన్ను మన్ను మాడ్కి మెరయు వేమా !*


*🌹తాత్పర్యము --*

అన్నం అంటు కాదు.

ఆత్మ అంటు గాదు.

అన్నం అంటుదైతే ఆత్మ కూడా అంటుదే అగును కదా !

అన్నశుద్ధి ఆత్మశుద్ధి ఒక్కటియే.

మిన్ను , మన్నువలె అన్నం , ఆత్మ ఈ రెండూ ఉంటాయి.


*💥వేమన పద్యాలు -- 159*


*అన్నమిడుటకన్న నధిక దానంబులు* 

*యెన్ని చేయనేమి యెన్నబోరు*

*యన్న మెన్న జీవనాధార మవునయా*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అన్నదానం మహాపుణ్య ఫలప్రదం.

అన్నమే జీవనాధారమని గమనింపుము.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: