🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*క్రింద చెప్పిన సాధనాల్లో ఏయొక్క దాని చేతనైనా ఈశ్వర సేవ చేస్తే మోక్షము సులభముగా లభిస్తున్నప్పుడు, ఈశ్వరుని కాదని ఇతర దేవతలను సేవించడం వల్ల ప్రయోజనం లేదనీ, ఆదేవతలను కోరదగినది గూడా ఏమీ లేదనీ, శంకరులు చెప్పారు.*
*శ్లోకం: 33*
*నాలం వాసకృదేవ దేవ హభవతస్సేవానతిర్వా నులతిః*
*పూజా వా స్మరణం కథాశ్రవణ మప్యాలోకనం మాదృశామ్।*
*స్వామి న్నస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే*
*కావా ముక్తిరితః కుతో భవతి చేత్కిం ప్రార్థనీయం తదా !!*
*పదవిభాగం:~*
*న_ అలం _ వా _ సకృత్ _ ఏవ _ దేవ _ భవతః _ సేవా _ నుతిః _ పూజా _*
*వా _ స్మరణం _ కథాశ్రవణమ్ _ అపి _ ఆలోకనం _ మాదృశామ్ _ స్వామిన్ _*
*అస్థిరదేవతానుసరణాయాసేన _ కిం _ లభ్యతే _ కా _ వా _ ముక్తిః _ ఇతః _*
*కుతః _ భవతి _ చేత్ _ కిం _ ప్రార్థనీయం _ తదా.॥*
*తాత్పర్యము:~*
*దేవా! స్వామీ ! శివా ! నిన్ను ఒక్కమారు సేవించినా, నమస్కరించినా, పూజించినా, స్మరించినా, దర్శించినా, నీ కథను విన్నా చాలు,. దీని కంటే ముక్తి మఱియొకటి లేదు. మా వంటి వారికి , పై చెప్పిన వాటిల్లో ఏ ఒక్కదానివల్ల నైనా ముక్తి కల్గుతూ వుండగా, అశాశ్వతులైన ఇతర దేవతలను కష్టపడి సేవించడం వల్ల ఏమి లభిస్తుంది ?*
*వివరణ :~*
*శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు. ఈశ్వరా! నిన్ను స్వామి అని పిలుస్తున్నారు. ఎందుకంటే నీవు సర్వ భూతములకూ అధ్యక్షుడవు. నీవు స్వప్రకాశ స్వరూపుడవు. అందువల్ల దేవుడవు . నిన్ను ఒక్కసారి సేవిస్తే చాలు. మాకు ముక్తి లభిస్తుంది. ఆసేవ నమస్కార రూపం, షోడశోపచార రూపం, లేదా నిన్ను స్మరించడం అనే మానసిక అర్చన కావచ్చు. నిన్ను స్తోత్రం చేయడమనే వాచిక సేవ కావచ్చు. ఈవిధంగా త్రికరణాలతో చేసే సేవ కాకుండా నీ కథలను ఆలకింపవచ్చు, దేవాలయాల్లో కృపావృష్టిని కురిపించే నీ మంగళమూర్తిని కన్నులారా తిలకింప వచ్చు. ఈ పైన చెప్పిన సేవలలో ఏ ఒక్కటి చేసినా నీవు మాకు మోక్షాన్ని అనుగ్రహిస్తావు.*
*శంకరులు తమ విష్ణుసహస్రనామ భాష్యంలో కృష్ణ నామస్మరణ గురించి ఇలా వ్రాశారు.*
*ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః*
*దశాశ్వమేధావబృధేన తుల్యః*
*దశాశ్వమేధీ పునరేతి జన్మ*
*కృష్ణప్రణామీ న పునర్భవాయ!!"*
*అర్థం ఏమంటే కృష్ణుడికి ఒక్కసారి నమస్కారం చేస్తే , అది పది అశ్వమేధయాగములు చేసిన దానితో సమానం . పది అశ్వమేధయాగములు చేసినవాడు తిరిగీ జన్మను పొందవచ్చు. కానీ కృష్ణనామాన్ని ఒక్కసారి ఉచ్ఛరించినవాడు మరలా జన్మింౘడు.*
*అలాగే శంకరుల వారు తమ భజగోవింద శ్లోకంలో ఇలా వ్రాశారు.*
"*భగవద్గీతా కించి దధీతా, గంగా జలలవ కణికా పీతా*
*సకృదపి యేన మురారి సమర్చా, క్రియతే తస్యయమేన నచర్చా।*"
*ఎవడు భగవద్గీతను కొంచమైనా చదువుతాడో, గంగాజలాన్ని కొంచమైనా ఆచమనం చేస్తాడో, శ్రీ హరిని ఒక్క సారైనా అర్చిస్తాడో, అతణ్ణి గుఱించి యముడు పట్టించుకోడు. ( అంటే అతడికి జనన మరణ భయం ఉండదు. అంటే ముక్తి లభిస్తుంది).*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి