8, ఏప్రిల్ 2025, మంగళవారం

ఉపదేశం

 34b6;54e5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



                  *ఉపదేశం*

                ➖➖➖✍️

       

 ```

శ్రీ రాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైనాడు.


ఒకనాడు శ్రీరాముని చూడడానికి వచ్చిన కైకేయి “రామా! ఈ భవబంధాలనుండి, సంసార సాగరం నుండి ముక్తి పొందే మార్గం తెలియక అల్లల్లాడే నాకు నీవే ఒక మార్గం చూపించాలి.” అని అడిగింది.


అది విన్న రాముడు… “అమ్మా... దిగులు పడకండి. రేపు లక్ష్మణుడు మిమ్మల్ని ఒక చోటుకు తీసుకుని వెడతాడు. అక్కడ మీకు తగిన మార్గం లభిస్తుంది.” అని అన్నాడు.


మరునాడు లక్ష్మణుడు కైకేయిని పల్లకిలో సరయూ నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ నది ఒడ్డున మేత మేస్తున్న ఒక మేకల మంద వద్ద పల్లకీని ఆపించాడు.

“అమ్మా.. ఒకసారి బయటకు రండి..” అని వినయంగా పిలిచాడు.


పల్లకి నుండి దిగిన కైకేయి తనకి ఎదురుగా వున్న మేకల మందను చూసింది. తనను పల్లకి నుండి ఎందుకు బయటకు రమ్మని పిలిచాడో కారణం తెలియక లక్ష్మణుని వైపు చూసింది.


కైకేయి సందేహం గ్రహించిన లక్ష్మణుడు… “అమ్మా..యీ మేకలు చేసే శబ్దాలు మీరు కొంతసేపు వినాలని చక్రవర్తి శ్రీరాముని ఆదేశం” అని అన్నాడు.


'మే..మే అని వందల సంఖ్యలో వున్న మేకల అరుపులను కొంచెంసేపు ఏకాగ్రతగా వినగానే కైకేయి మనసులో ఏదో స్పష్టత ఏర్పడింది.


వెంటనే… “లక్ష్మణా! ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి రాముడు నాకు చూపిన మార్గం అర్ధమైనది. ఇక మనం రాజ భవనానికి వెళ్ళిపోదాం” అన్నది.


రాజభవనానికి తిరిగి వచ్చిన కైకేయిని శ్రీరాముడు ఆహ్వానించాడు. రామునితో కైకేయి “రామా.. నదీతీరాన నేను ఒక మేకల మంద అరుపులను తదేకదీక్షతో విన్నాను.

‘మే...మే...’ అంటే నాది అని అర్ధం కదా ..! ‘నేను అనే అహంకారంతో, నాది అనే కోరికతో బ్రతికినందువలనే ఇప్పుడు మేము మేకలు గా పుట్టాము’ అని అవి నాకు చెప్తున్నట్టుగా తోచింది.

'నేననే అహంకారం.. నాది అనే మమకారం మనిషిని అజ్ఞానాంధకారంలోకి నెట్టుతోందని గ్రహించాను. ఇంక మీద నేను ఈ లౌకిక భవబంధాలను త్రెంచుకొని ప్రశాంతిగా జీవిస్తాను.” అని అన్నది కైకేయి.


అది విని చిరునవ్వు నవ్విన రాముడు… “తల్లీ! నిజం గ్రహించారు. పుత్రునికి తల్లికి ఉపదేశించే అర్హతలేదు. అందువలన మీకు మీరుగా సత్యాన్ని తెలుసుకునేందుకు మిమ్మల్ని మేకల మంద వద్దకు పంపించాను.” అని పలికాడు.


శ్రీరాముని వివేకం, వినయసంపత్తి ఆయన ఔన్నత్యానికి దర్పణం పడుతుంది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     

🗣️భవిష్యత్తు తరాలకు సంస్కృతి,సంప్రదాయాలు,విలువలతో పాటు మంచి నడవడికను, సంస్కారాన్ని నేర్పగలరు.

----------------------------------------------

🦁🌹*సనాతన ధర్మ పరిరక్షణ*🌹🦁

-------------------------------------------

.............................................

గమనిక :ఈ *కలియుగం లో భగవంతుడు నామరూపంలో* ఉంటాడు, కాబట్టి సదా ఈ నామాన్ని( *హరే కృష్ణ మంత్రం)* స్మరించండి,ఆనందించండి🌸🌷🌹😃

--------------------------------------------

🌸 అందరూ ఒక్కసారి,

👉 జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభునిత్యానంద 

శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాధి గౌర భక్త బృంద! అని (ఒక్కసారి చెప్పి)

👉 ఈ మహామంత్రాన్ని

🧘🏻‍♂️ *హరే కృష్ణ హరే కృష్ణ* 

      *కృష్ణ కృష్ణ హరే హరే* 

      *హరే రామ హరే రామ* 

      *రామ రామ హరే హరే"*🧘🏻‍♂️

         (108 సార్లు పలకండి) 

........................................................🙇‍♂️

కామెంట్‌లు లేవు: