8, ఏప్రిల్ 2025, మంగళవారం

శ్రీరామచంద్రుడు సీతామహాసతిన్

 శ్రీ రామచంద్రాయ నమః 🙏🙏🙏


శ్రీరామచంద్రుడు సీతామహాసతిన్

            బరిణయం బాడెడి భవ్యవేళ

 కాంతులీనెడి సీత కమలాంజలీ పుటిన్

          బద్మరాగము భాతి పరిఢవిల్లి

మహానీయు రాముని మస్తకంబున నుండ 

          కుంద విరుల భంగి నందగించి

నీలమేఘచ్ఛాయ నెగడు శ్రీరాముని

         తనువుపై జారెడి తరుణమందు 

నింద్రనీలపుకాంతుల నినుమడించి

మోదమును గూర్చు చుండెడి ముత్యసేస

మిగుల శోభను వర్తిల్లి మించి సొగసు

ననయ శుభముల నిడుగాక నందఱికిని


 శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు,వందనములు 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: