24, జులై 2025, గురువారం

ప్రశ్న పత్రం సంఖ్య: 43

 ప్రశ్న పత్రం సంఖ్య: 43                             

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఈ ప్రశ్న పత్రం సర్వ జన ప్రయోజనకరంగా వుండే విషయాలను తీసుకొని తయారు చేయబడినది. కాబట్టి అందరు దీనిని కూలంకుషంగా చదివి జవాబులు ఇవ్వ ప్రయత్నించండి.  ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఇవ్వబడ్డయ్యి అందులో సరైనది ఎంచుకోండి. 

1) _____ లక్షల జీవరాసులలో మానవ జన్మే ఉత్కృష్టమైనదిగా దైవజ్ఞులు చెపుతారు 

i)   64

ii) 66

iii)84

iv) 94 

2) మానవ శక్తితో నడిచే వాహనము ఇది 

i)  సైకిలు 

ii) మోటారు సైకిలు    

iii) కారు   

iv) స్కూటరు 

3)పురాణాలు ఎన్ని 

i)  28

 ii) 19

 iii) 18

iv) 32

4) మానవ శరీరంలో ఇది నిత్యం పెరిగే ఒక నిర్జీవ కణజాలం 

i)   కాలు 

ii) వేలు 

iii) గోరు

 iv) కళ్ళు 

5) రెటీనా అనునది ఈ అవయవానికి సంబందించినది 

i)  కాలు 

ii) ముక్కు 

iii) కన్ను 

iv) నాకు తెలియదు 

6) ఇది ప్రస్థాన త్రయంలో లేదు 

i)  బ్రహ్మ సూత్రాలు 

ii) రామాయణం 

iii) భగవత్ గీత 

iv) ఉపనిషత్తులు 

7) భగవత్ గీతలో ప్రతి అధ్యాయంలో ఈ పదము ఉంటుంది 

i)  వియోగము 

ii) సంయోగము 

 iii) యోగము 

iv) అన్నీ 

8) సంక్రాంతి తప్ప మిగిలిన పండగలు ప్రతి ఏడు ఒకే తారీఖు నాడు రావు ఎందుకంటె 

i)   మన పంచాంగము చంద్రమానము కాబట్టి 

ii)   మన పంచాంగము సౌర మానము కాబట్టి 

iii)  మన పంచాంగము బృహస్పతి మానము కాబట్టి 

iv) నాకు మానవమానాల గురించి తెలియదు 

9) "ముదితల్ నేర్వగా రాని విద్య గలదె ముద్దర నేర్పించినన్" అని అన్నది ఎవరు  

i) పానుగంటి లక్ష్మి నరసింహారావు సాక్షి సంపుటిలో

ii) చిలకమర్తి లక్ష్మీనరసింహం  "ప్రసన్న యాదవమ్" నాటకంలో 

iii) శ్రీ శ్రీ  మహాప్రస్థానంలో 

iv)  అల్లసాని పెద్దన మనుచరిత్రలో 

10) నిత్యాగ్నిహోత్రుడు అని ఎవరిని అంటారు 

i) రోజు గుడికి వెళ్లే వానిని

ii) రోజు గృహంలో అగ్నికార్యాన్ని (యజ్ఞము) చేసే బ్రాహ్మణుడిని

iii) రోజు దీపారాధన చేసే బ్రాహ్మణుడిని

iv) గుడిలో అర్చకత్వం చేసే బ్రాహ్మణుడిని 

11) స్వచ్ఛమైన నీరు ఒక 

i) ఆమ్లాద్రావణము

ii) తటస్థ ద్రావణము

iii) క్షార ద్రావణము 

iv)  కొన్ని సార్లు ఆమ్లంగా కొన్ని సార్లు క్షరంగా ఉంటుంది. 

12) ఇది ఒక ఇంద్రియము కాదు 

i) కళ్ళు,

ii) ముక్కు,

iii) మెదడు

iv)  చెవులు

12) ప్రతి బ్రాహ్మడు ప్రతి రోజు విధిగా ఈ కార్యం చేయాలి  

i) గాయత్రి జపం చేయాలి

ii) రామకోటి వ్రాయాలి

iii) దీపారాధన చేయాలి

iv)  పరనింద చేయాలి 

13) రాశిచక్రంలో రాహువు ఉన్నఇంటికి సరిగా వ్యతిరేక ఇంట్లో ఈ గ్రాహం ఉంటుంది 

i) గురు గ్రాహం

ii) చంద్ర గ్రాహం

iii)శని గ్రాహం

iv)  కేతు గ్రాహం 

14) వేదాంతం అంటే 

i) రామాయణంలో వివరించింది

ii) భారతంలో వివరించింది

iii) ఉపనిషత్తులలో వివరించింది

iv)  స్వామీజీలు భోదించేది 

15) ఈయన ఒక ప్రబంధ కావి కాదు

i) అల్లసాని పెద్దన్న

ii) రామరాజ భూషణుడు (భట్టుమూర్తి )

iii) ముక్కు తిమ్మన

iv)  రామకృష్ణుడు 

16)  ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోగ్రత యెంత ఉంటుంది 

i) 98.3 డిగిరీల ఫారెన్ హీట్

ii) 98.6 డిగిరీల ఫారెన్ హీట్

iii) 98.8 డిగిరీల ఫారెన్ హీట్

iv) 98.9 డిగిరీల ఫారెన్ హీట్

 


 


 ,


 


కామెంట్‌లు లేవు: