**వానాకాలము**
పొద్దు నియమాల పరీక్ష కాలం
పొద్దు కనుపడక పొయ్యే కాలం
చెరువులు గుంటలు నిండే కాలం
కప్పలు బెకబెక అరిచే కాలం
పక్షుల రెక్కలు నానే కాలం
ఆకట డొక్కలు ఎండే కాలం
ఆగక వానలు కురిసేకాలం
పిండిన బట్టలు ఆరని కాలం
పుస్తకాలనూ చించే కాలం
పడవలు ఎన్నో చేసే కాలం
పిల్లలు జెల్లుల తడిసే కాలం
దగ్గులు జలుబులు పట్టే కాలం
దారుల ఏరులు సాగే కాలం
బడులకు సెలవలు యిచ్చేకాలం
దాచిన గొడుగులు తెరిచే కాలం
వేసుక బయటను తిరిగే కాలం
ఆకలి మెండుగ వేసే కాలం వేడిగ పకోడి మెక్కే కాలం
బామ్మ ప్రక్కనా దూరే కాలం వెచ్చగ నిద్దుర పొయ్యే కాలం
వానాకాలం వానాకాలం మనసుకు ప్రీతిని తెచ్చే కాలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి