18, జులై 2025, శుక్రవారం

సుభాషితము

 శు భో ద యం 🙏


సుభాషితము

                                                     ------------------------ 


               చ: అతనికి వార్ధి కుల్య యగు; నగ్ని జలంబగు మేరుశైల మం


చ మంచిత శిల లీలనుండు, మదసింహము జిక తెఱంగుఁ దాల్చుఁ గో


                    పిత ఫణి పూలదండ యగు , భీష్మ విషంబు సుధారసంబగున్


                   క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వరియందు శోభిలున్ ;


                     భర్తృహరి సుభాషితములు: సజ్జన పధ్ధతి: ఏనుఁగు లక్ష్మణ కవి;


                                లోకం మెచ్చే మంచి నడవడి కలవానికి అన్నీ వశ్యమే! యెలాగంటే, సముద్రం కూడా అతనికి పిల్లకాలువే, సునాయాసంగా దాటఁగలడు. భయంకరమైన అగ్నిగూడా చల్లబడి జలంగా మారిపోతుంది. మేరుపర్వతంగూడా చిన్న గండశిలగా

మారుతుంది. మదించిన సింహంకూడా జింకపిల్ల అయిపోతుంది. కోపంతో బుసలుగొట్టే పాము పూలదండగా మారి పోతుంది. ప్రా

ణహానికలిగించే విషంకూడా అమృతమైపోతుంది. వీటి యన్నింటికీ కారణం ,అతనిలోని సజ్జనత్వమే!


                           సముద్రం పిల్లకాలువ అవటం , అగ్ని జలంగామారటం, మేరుపర్వతం చిరు శిలగామారటం , సింహం జింకగావటం, 

పాము పూలదండ యవటం, విషం అమృతంగా మారటం; మొ:వి: పరస్పర విరుధ్దములు. మంచితనంతో విరుధ్ధమైన విషయాలను

కూడా మానవుడు సాధింప వచ్చును. కాబట్టి మంచితనంవైపు మరలండి! జనులందరితో సఖ్యంగా ఉండండి! అదే సర్వార్ధ సాధకమని

ఉపదేశం!


                                                               స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: