*నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం.*
ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం..
*అమ్మ అరగంట కనబడ కుంటేనే అల్లాడిపోయిన మనం..*
అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం..
*నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...*
నేనే హీరో”... నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం..
*నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లు స్నేహితులతో పంచుకున్న మనం...*
చిల్లరబుద్ధులతో,సంపాదనలో, అవే చిల్లర కూడా, .....తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచు కుంటున్నాం..
*చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం..*
ఇప్పుడు వస్తుంటే భయపడుతున్నాం...
*బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటిపడుతూ ఒకే కుటుంబంగా పెరిగిన మనం..*
ఇప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక కుటుంబాన్ని చిన్నదిగా మల్చు కుంటున్నాం..
*చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం...*
ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం..!
*మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి.., కొన్నాళ్ళు మనిషిలానే పెరుగు తున్నాం.*..
కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం...
*మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం..!*
మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం.!!
*నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం.!!!*
ఎందుకంటే...
మనం ఎదుగుతున్నాం..!
మనం మనకే అందనంతగా...
మనం ఎదుగుతున్నాం..!
మనం,మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం అని కూడా తెలియనంతగా...
నిజంగా మనం ఎదుగుతున్నామా?...
........ ఆలోచన చేయండి.....🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి