1 🙏🙏🙏లటానుప్రాసము
అర్ద భేదము లేకుండా తాత్పర్యభేదము కలిగి వర్ణముల యొక్క జంట గాని సమూహము గాని అవ్యధానముగా ఆవృత్తి అయిన లాటాను ప్రాసము ఉదాహరణ
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాధు వర్ణించు జిహ్వజిహ్వ
లటానుప్రాసము అనేటప్పటికి గుర్తుకు వచ్చే ఏకైక పద్యం ఇక్కడ "కరములు కరములు " "జిహ్వ జిహ్వ "అవ్యధానముగా ఆవృత్తి అయినది. .కరములు అనగా చేతులు అని అర్ధము జిహ్వ అనగా నాలుక ఇక్కడ అర్ధభేదము లేదు కాని కమలాక్షుని అర్చన చేయు చేతులే చేతులు అని శ్రీనాధుని వర్ణించునట్టి నాలుకయే నాలుక అని తాత్పర్యభేదము కనబడుచున్నది కావున లటానుప్రాసము.
శ్రీనాధుడు అంటే గుర్తు వచ్చింది అయన వ్రాసిన లటానుప్రాస పద్యం
"శ్రీ భీమ నాయక శివనామధేయంబు చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ
దక్షవాటీ పురాధ్యక్ష మోహన మూర్తి చూడంగ నేర్చిన చూపు చూపు " ముందుగా శ్రీనాధుడు వ్రాశారు.ఈ పద్యమును బట్టి పోతన గారు కమలాక్షు నర్చించు కరములు కరములు పద్యం సాన బట్టి ఎంతో రమ్యముగా వ్రాసి జనుల జిహ్వలపై నాట్యమాడించారు శ్రీనాధుని పద్యం పండిత లోకమునకు తప్ప సామాన్య జనులకు తెలియదు.( ఇది భీమేశ్వర పురాణము లోనిది )
అటులనే "తల్లిదండ్రులను సేవించు సుతుడు సుతుడు " "విద్యాబుద్దులు నేర్పు గురువు గురువు " ఇల్లా ఎన్నైనా తయారుజేయవచ్చు.
ఆచార్య ఆత్రేయ గారు లాటాను ప్రాసములో
" అడగక ఇచ్చిన ముద్దు ముద్దు "అని లాటాను ప్రాసానుగుణముగా వ్రాశారు. అయితే స్వర కల్పనకు అనుకూలముగా లేదు మార్చాలి అని పట్టు పడితే అప్పుడు "అడగక ఇచ్చిన ముద్దే ముద్దు అని మార్చవలసి వచ్చింది అప్పుడు తాత్పర్యార్థము వ్రాసి ఇచ్చారు అయినా లాటాను ప్రాసము అవుతుంది
2 యమకము
యమకము అంటే సంస్కృతంలో " జత " అని అర్ధము కాని సమూహం కూడా గ్రహిస్తున్నారు
వర్ణముల జంట గాని సమూహము గాని అర్ద భేదము కలిగి వ్యవధానముగా ఆవృత్తి అయిన
యమకము అనెడి శబ్దాలంకార�
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి