13, సెప్టెంబర్ 2025, శనివారం

కొడుకుల్ పుట్టరటంచు


కొడుకుల్ పుట్టరటంచు నేడు రవివేకుల్ జీవనభ్రాంతులై! కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్ వడసెన్? పుత్రులులేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్రుకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! 28


ఈశ్వరా! లోకంలోని జనులు ఎంత అవివేకులు! కొడుకులు పుట్టలేదని, తమకు ఉత్తమగతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తున్నారు. కౌరవచక్రవర్తి దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టారు కదా! వారి వల్ల అతడు ఎంత ఉత్తమగతిని పొందాడు. బ్రహ్మచారిగా ఉండి అపుత్రకుడైన శుకమహర్షికి ఏ దుర్గతులు కలిగెను. ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైన వానికి మోక్షమార్గము మూసుకొని పోవునా? వట్టిది. "జ్ఞానేనహి నృణాం మోక్షః"



కామెంట్‌లు లేవు: