25, సెప్టెంబర్ 2025, గురువారం

ఎంతటిపుణ్యమో

 శు భో ద యం 🙏


"ఎంతటిపుణ్యమో శబరియెంగిలిఁగొంటివి వింతగాదె నీ

మంతన మరయఁగా,యుడుత మైని కరాగ్రనఖాంచలమ్ములన్

సంతసమందఁజేసితివి;సత్కులజన్మములేమిలెక్క?వే

దాంతముగాదె,నీమహిమ!దాశరధీ కరుణాపయోనిధీ!

- కంచెర్ల గోపన్న.


    భగవంతుని లీలలు అనుాహ్యములు.శబరి భిల్లకాంత,పండుముదుసలి.ఆమెయొసగిన యెంగిలి పండ్లను ముదమారగ నారగించి ఆమెకు మోక్షము నొసంగెను.

  సేతుబంధనసమయమున ఉడుత చేయు సాయమును పరికించి పులకితుడై దానివీపున తనకరాగ్రముననిమిరెను.కరుణార్ద్రములైన స్వామి చేతిచిన్నెలు ముచ్చటగొలుపు చారలుగా నాజాతికి దఖలు పడినవి.

     ఏమిది?స్వామి తనభక్తులపట్ల చూపు కారుణ్యమునకు హద్దులులేవు.చిన్నపెద్దలను తారతమ్యములు లేవని తెలియజెప్పుటగదా?

       రామా! నీమహిమ వేదాంతమయ్యా!మాటలకందదు.

                   స్వస్తి!!!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: