5, జులై 2020, ఆదివారం

బ్రహ్మము వేరు, బ్రహ్మదేవుడు వేరు


మనందరికీ తప్పకుండా తెలిసిన శ్లోకం ఒకటుంది.

శ్లో।। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దే వో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ।।

శ్లోకాన్ని అర్థంచేసుకోవడానికి అందులోని పదాల్ని విడదీయాలి. దీన్ని పదవిభాగం అంటారు.
పై శ్లోకానికి పదవిభాగం ఇలా ఉందిగురుః, బ్రహ్మా, గురుః, విష్ణుః, గురుః, దేవః, మహేశ్వరః, గురుః, సాక్షాత్, పరంబ్రహ్మ, తస్మై, శ్రీగురవే, నమః. నమః = నమస్కరిస్తున్నాను, (ఎవరికి) శ్రీగురవే = దైవస్వరూపుడైన గురువుకు. (గురువు ఎలాంటివాడు?) గురుః = గురువు, బ్రహ్మా = సృష్టికర్త అనబడే నాలుగు తలల బ్రహ్మదేవుడు (తో సమానుడు). గురుః విష్ణుః = గురువు విష్ణువు (తో సమానుడు). గురుః = గురువు, దేవః మహేశ్వరః = దేవుడైన మహేశ్వరుడు (తో సమానుడు). గురుః సాక్షాత్ = గురువు సాక్షాత్తుగా, పరంబ్రహ్మ = పరబ్రహ్మము. అలాంటి గురువుకు నమస్కారమని అర్థము.

ఇందులో మొదటి వాక్యంలో బ్రహ్మా అని హకారానికి దీర్ఘ ముంది. రెండవ వాక్యంలో బ్రహ్మ అని హకారం హ్రస్వంగా ఉంది. రెండింటికీ తేడా తెలియడం చాల ముఖ్యం. పురాణవాఙ్మయంలో నాలుగు తలల బ్రహ్మదేవుణ్ణి, సరస్వతీదేవి భర్త ను గూర్చి తెలుసుకుంటాం. ఇతడొక వ్యక్తి. నాలుగు తలలు, నాలుగు వేదాలకు ప్రతీకలు (symbols). ఇతను బ్రహ్మదేవుడు. రెండవ వాక్యంలో చెప్పిన బ్రహ్మ ఒక వ్యక్తి కాదు. ఇంతకుముందు చెప్పుకున్న సత్యము, జ్ఞా నము, అనంతము అనబడే శుద్ధ చైతన్య స్వరూపము. దీనిని బ్రహ్మము అంటామనీ, అన్ని దేవతా స్వరూపాలూ దీనిలోని భావనలేననీ, సృష్టికి కారణం. 

ఇది  బ్ర. శ్రీ. డా. కె. అరవిందరావు విరచించిన పురోహిత ప్రపంచం అనే గ్రంథంలోని 52 పేజీ నుండి సంగ్రహణ 

కామెంట్‌లు లేవు: