31, అక్టోబర్ 2020, శనివారం

ధార్మికగీత - 66*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        *ధార్మికగీత - 66*

                                  *****

            *శ్లో:- అతిథి  ర్బాలక   శ్చైవ ౹*

                   *స్త్రీజనో  నృపతి  స్తథా  ౹*

                   *ఏతే  విత్తం  న  జానన్తి  ౹*

                   *జామాతా చైవ పంచమః ౹౹*

                                     *****

*భా:- సంసారం ఒక సాగరం. దాని బాధలు వర్ణనాతీతం. వీటికి తోడు మన చుట్టూ తిరుగుతూ, మనల్ని పట్టి పీడించే గ్రహాలు, ఉపగ్రహాలు మరో ఐదు ఉన్నాయి. అవి. 1. "అతిథి":- తిథి,వార,తారాబలం పట్టింపు లేకుండా రావడమే గాక, స్నానానికి వేడివేడి నీరు,కాఫీ,టిఫిన్,విందు,పాన్పు  వంటి షోడశోపచారాలను తప్పనిసరి హక్కుగా ఆశిస్తాడు. 2."బాలలు":-  రోదనమే వీరి అస్త్రము,శస్త్రము. కొండమీది కోతి కావాలని మంకు పట్టు పడతారు. సాధ్యాసాధ్యాలు వారికి పట్టవు. కోరేది ఇచ్చేదాకా వదలరు.  3. "స్త్రీజనము":- భార్యామణి ఖరీదైన చీరలు,నగలు,అలంకరణ, గృహసామాగ్రి కోసం పదే పదే ఒత్తిడి పెట్టి, సాధించి తీరతారు.  4."నృపతి" :-  ప్రభుత్వము  వృత్తి, ఆదాయ, ఇంటి, నీటి, స్థిరాస్తి, వస్తు సేవా పన్నులు; భూసేకరణ, రోడ్లవిస్తరణ వంటి చట్టాలను విధిగా అమలుచేస్తుంది. మన గోడు పట్టించుకోదు.  5. "జామాత":- అల్లుడుగారు. వస్తు-వాహనాలు,నగలు-నగదు, ఇల్లు-ఇల్లాలు అమిరినా తృప్తి పడక, కొత్త కోరికలకోసం పట్టువదలని విక్రమార్కుడై పీడిస్తాడు. వీరికే దశమగ్రహమని పేరు, ఇలా యీ ఐదుగురు మన స్థితిని-పరిస్థితిని, చిత్తమును- విత్తమును; మదిని - హృదిని    అణుమాత్రం కూడా గ్రహించజాలరు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. వీటన్నిటిని ఓర్పుతో, నేర్పుతో అధిగమించడమే గృహస్థాశ్రమధర్మము*. 

                                      *****

                     *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: