31, అక్టోబర్ 2020, శనివారం

ఆదికవి వాల్మీకి మహర్షి*

 *ఆదికవి వాల్మీకి మహర్షి*


నేడు ఆదికవి అయిన *మహర్షి వాల్మీకి జయంతి*


మహా పుణ్య కవి , రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు . వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి తన జీవిత కాలంలో పాపా, పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు , తన రామాయణ ఇతిహాసం. మానవుడు రచించిన తొలి గ్రంథము , చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి ఇతని సమకాలం గురించి చెప్పడమే కాకుండా కథనం మధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందింది. హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది.


వాల్మీకి గొప్ప మహర్షి, తపఃశాలి. ఈయన రచించిన వాల్మీకి రామాయణాన్నే భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారు.

రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది.


ఆ కథనం ప్రకారం వాల్మీకికి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . ఆయన తన కుటుంబాన్ని పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారుల సొత్తును దోచుకుని జీవితం గడిపేవారు. ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ….. కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ప్రశ్నిస్తారు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు. నారదుడు రామనామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తారు.


ఉపదేశం తర్వాత ఆయన జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధి లోకి వెళ్ళిపోయారు చుట్టూ చీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తారు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా వాల్మీకి అనే పేరుతో పిలుస్తాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యారు. తపఃసంపన్నత తర్వాత వాల్మీకి ఆశ్రమవాసం చేయసాగారు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలకు జన్మనిచ్చినట్లూ..తెలుస్తుంది.


యోగవాశిష్టము అనే యోగా, ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు.ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే.

రాముడు పది-పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై, మానసిక ధౌర్భల్యమునకు గురి అయిన ప్పుడు వశిస్టుడి ద్వారాయోగా, ధ్యానములను శ్రీరాముడికి బోధించారు వ్రాసింది. వాల్మీకిమహర్షి, పలికింది, బోధించింది వశిస్టుడు,అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది.


ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే. కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు వాల్మీకియే. మహర్షివాల్మీకి “వాల్మీకి మతము” అనే దానిని నెలకొల్పారు.


భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ రామాయణ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము.


24,000 శ్లోకము లతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు- భక్తుడు – వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.

అటువంటి సుందర కావ్యాన్ని చదివేముందు మనం వాల్మీక మహర్షిని స్మరించుకోవాలని పండితులు ఆయనను ఎంత అందంగా అనుభూతిస్తారో చూడండి.


కూజంతం రామ రామేతి I మధురమ్ మధురాక్షరమ్ II

ఆరుహ్య కవితా శాఖాం I వందే వాల్మీకి కోకిలమ్ II


కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని, వాల్మీకి అనే కవికోకిల, మధురమూ మధురాక్షరమూ అయిన రామనామాన్ని పాడుతోందట! ఎంత సౌందర్య సంపూర్ణ ఆస్వాదనో!


ఈ స్లోకంలో ఆదికవి వాల్మీక మహరిషి ని కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని రామాయణ పారాయణ చేసిన “కవికోకిల” గా వర్ణించారు పండితులు


ఈ శ్లోకంలో కవిత్వమనే పెద్దచెట్టుకు వాడిన “ఆరూహ్య ” పదం అద్భుతం.


రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు.


రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం.


ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయింది.

వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు.


శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది.


ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.


మనకు ప్రామాణికతను అందించిన ఆదికవి వాల్మీకి మహఋషిని మనసారా స్మరించుకుందాం.

కామెంట్‌లు లేవు: