5, అక్టోబర్ 2020, సోమవారం

దసరా పూజలకోసం పూజా మందిరం

 దసరా పూజలకోసం పూజా మందిరం ఏ దిశగా ఏర్పాటు చేసుకోవాలి?

ఈశాన్యం వైపు పూజా మందిరం ఉండడం శ్రేయస్కరం. అయితే దేవప్రాచి అని ఒక సూత్రం ఉంది. అంటే దేవుడు ఏ దిక్కున ఉంటాడో ఆ దిక్కునే తూర్పు గా భావించాలి. సాధారణంగా ఇళ్ల లో పూజా మందిరం పడమర ముఖంగా ఉంటుంది. మనం తూర్పు ముఖంగా కూర్చుని పూజించుకుంటాము. ఇది ఉత్తమ మైన పద్ధతి. భగవంతుని తూర్పు ముఖంగా ఉంచి పూజించే వారు పడమరను చూస్తూ కూర్చుని అర్చించుకోవచ్చును. లేదా దైవాన్ని దక్షిణాభిముఖంగా ఉంచుకుని మనం ఉత్తరానికి తిరిగి పూజించుకోవచ్చును. పక్కకు తిరిగి కూర్చునేవారు దైవానికి ఎడమవైపున కూర్చోవడం మంచిది. మధ్యలో దైవాన్ని పెట్టి చుట్టూ సమూహంగా కూర్చుని ఉన్నప్పుడు ఏ దిక్కున కూర్చున్నా పర్వాలేదు.

కామెంట్‌లు లేవు: