17, నవంబర్ 2020, మంగళవారం

వేమన పద్యం

   వేమన పద్యం *


చెఱకు లోననైన జెడ్డగుణంబున్న, 

దీసివేయకున్న  దినగా బొసఁగఁ, 

దంతి పురము ద్రోహి యాతడెట్లుండురా, 

విశ్వదాభిరామ వినుర వేమ *


భావము =


సాధారణంగా మనకు అందరికీ ఇష్టమైనది రుచులలో తీయదనం, ఆ తియ్యదనం కు మూలము చెఱకు, ఎంతో ఇష్టంగా చెఱకు గడను కూడా మనం తింటూ వుంటాము. ఆ గడ లో ఎక్కడైనా పుచ్చు వచ్చినచో దాన్ని, కొరికితే  గట్టిగా ఉండి, మన నోటిలోని పళ్లకు  హానికరం, పళ్ళు ఊడి పోవచ్చు కూడా,  కనుక ఆ గట్టిగా వున్న పుచ్చు ను తీసివేసి తింటాము. ఇక్కడే మనకు  ఓ సంగతిని అంతర్లీనంగా వేమన గారు మనకు చెప్పారు, అదేమిటంటే, చెఱకు ఎంతతిపి అయినా పుచ్చు తీసివేసాము,పుచ్చుతో తింటే పళ్ళు ఊడిపోవచ్చు,  అలాగే మన కడుపున పుట్టిన వాడిని కూడా  చిన్నప్పటి నుండి వాడిలో పెరిగిన పుచ్చు అనే దుర్మార్గం ను ప్రతీ తల్లి తండ్రి, ఖండించి, వాడిని దండించినచో, క్రమశిక్షణ లో పెంచినట్లయితే , సమాజం లో దుర్మార్గుడు అనే వాడు  ఉండడు అని,లేని పోనీ గారా బాలు పెట్టి వాడు చేసిన, ప్రతీ చెడుపనిని పుత్రుడనే వాత్సల్యం తో సమర్ధించవద్దని, అందువల్ల మన బిడ్డే సమాజం లో దుర్మార్గుడు అవుతాడని,  అందరి తల్లి తండ్రులకు వేమన తియ్యనైన చెరకుతో హితవు చెప్పారు. నిజమే అప్పటి కాలంలో  క్రమశిక్షణ ఇప్పుడేది, అందుకే లేనిపోని నేరాలు, అఘాయిత్యాలు , జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లలే పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు .అది పెంపక లోపం.  ఈనాటి సమాజాన్ని ఆనాడే వేమన ఊహించారు . తప్పకుండ మన పిల్లలను చెడు మార్గం వైపు మళ్ల కుండా, సన్మార్గములో పెంచుకుందాం. 


మీ రాజబాబు 😷🎹🎼🎤

కామెంట్‌లు లేవు: