17, నవంబర్ 2020, మంగళవారం

మానవుడు ప్రకృతి

 మానవుడు ప్రకృతిని నాశనం చేసి కోరికలను తీర్చు కోవాలి అన్న తపన ఎక్కువైంది. దీనికి కారణం దురాశ అహంకారం. ధర్మం జయెూస్తు. అధర్మస్య నాశ్యోస్తు.అన్న వేదోక్తివి సార్థకం చేయుటయే సనాతన ధర్మాచరణ. ప్రకృతిని రక్షిస్తే ధర్మమే. తద్వారా వాటి ఫలములను అనుభవించవచ్చు. ప్రకృతిని మనం నాశనం చేస్తే దాని సమతుల్యత సాధించుటకు విపరీత వాతావరణ మార్పులు.ఏదైనా అవసరార్ధం మట్టిని మెుదలగు పంచభూత తత్వ పదార్ధ లక్షణములను స్వీకరించుటకు తవ్వే ముందు కూడాలేక వాటిని వుపయోగించే ముందు వాటిని లోక కళ్యాణ నిమిత్తమే ప్రజా హితం కోరి ప్రకృతిలో వస్తువులను సంగ్రహించుట వైదిక సనాతన సంప్రదాయం. పంట వేసే ముందు కూడా అటులనే భూమిలో జీవరాశులకును హాని చేయకుండా వాటి సృష్టి కర్తయైన భూ దేవుని ప్రార్థన చేసి వాటికి యిబ్బంది లేకుండా పూజచేసి ఆచరించుట ధర్మం. అదే వైదిక మానవ జీవన సంప్రదాయం. అప్పుడే ఋతు ధర్మం తద్వారా సృష్టి ధర్మం. ప్రకృతి ఆరాధన. వృక్షో రక్షిత రక్షిత. అన్నింటిలో జీవం వున్నదని వాటి రక్షణయే సనాతన ధర్మమని తెలియుటయే సత్వ గుణ లక్షణము. సమస్తమును  జయించుటకు మానవులకు అసంభవం.ఎందుకనగా మనం దేనినీ సృష్ఠంచలేదు.ప్రకృతిని అనుభవించుచూ తనను తాను జయించు ప్రయత్నం చేయాలి.అదియే మానవ ధర్మం.

కామెంట్‌లు లేవు: