29, జనవరి 2021, శుక్రవారం

పశుసంబంధమైన ధర్మసూత్రములు -

 పశుసంబంధమైన ధర్మసూత్రములు  -


 *  పశువుల కాపరికి యజమాని కూలి ఇవ్వనిచో యజమానికి పది ఆవుల పాలు పిండి ఇచ్చి తానొక్క ఆవుపాలు కూలికింద తీసుకొనవచ్చు . జీతము లేనప్పడుదియే కూలి .


 *  కంటికి కనపడనిది , పురుగులచే , కుక్కలచే తినబడినది , పల్లపు గుంటలు మొదలగు వానిలో పడి చచ్చినది , కాపరి లేనప్పుడు పారిపోయినది అయిన పశువులకు పశుకాపరిదే భాద్యత. కాపరి తెచ్చి ఇవ్వవలెను.


 *  దొంగలు దొమ్మిచేసి పశువులను అపహరించుకు పోయిన విషయము కాపరి వెంటనే యజమానికి దగ్గరలో ఉన్నప్పుడే చెప్పినచో కాపరి యజమానికి పశువులను ఇచ్చుకోవాల్సిన బాధ్యత లేదు .


 *  చచ్చిన పశువు చెవులు , చర్మం , తోక , వెంట్రుకలు , గోరోచనము వీటిని యజమానికి ఇవ్వవలెను. తక్కిన గిట్టలు , కొమ్ములు మున్నగునవి అన్నియు యజమానికి చూపించి మరలా తాను తీసికొనవలెను.


 *  దారిలోను , బూడిదలోను , గోవుల మందలోను మలమూత్రాలను విసర్జించరాదు . గోవుకి ఎదురుగా మలమూత్రాలను విసర్జించరాదు.


 *  నీరు తాగుచున్న ఆవును గాని , పాలు తాగుచున్న దూడను గాని నివారించరాదు. పాలు తీయునప్పుడు మూత్రం పోయుటను నివారించవచ్చు. ఇతరుల దూడలు పాలు తాగుచున్నప్పుడు వారికి చెప్పకూడదు. ఇంద్రధనుస్సును ఆకాశమున చూచి ఆ దోషమును ఎరిగిన వాడై ఉండి ఇతరులకు చూపరాదు.


 *  తుంటరివి , ఆకలిరోగములు గలవి , కొమ్ములు లేనివి , గుడ్డివి , గిట్టలు లేనివి , తోకలేనివి అగు వృషభములను కట్టిన బండ్లలో ప్రయాణం చేయరాదు .


 *  మచ్చికపడినవి , వడిగా నడుచునవి , శుభలక్షణాలు కలిగినవి , వన్నెయు , ఆకారం కలిగి ఉండునవి అగు ఎద్దులను గట్టిన బండ్లలో మునికోలతో పొడవవలెను.


 *  చతుష్పాద జంతువు విషయమై అపద్ధం చెప్పినవాడు అయిదుగురు బంధువులను , గోవు విషయమై అపద్ధం చెప్పినవాడు పదిమందిని, గుఱ్ఱముల విషయమై అపద్ధం చెప్పినవాడు వంద మందిని , మానవుల విషయమై అపద్ధం చెప్పినవాడు వెయ్యిమంది బంధువులకు చంపిన పాపమును పొంది నరకమునకు పోవును .


 *  ఈని పది దినములు గూడ గడవని గోవులను , చక్రము , శూలము మొదలగు గుర్తులు వేసి విడిచిన ఎద్దులను , హరిహరాదుల ముద్రలు వేసి ఉన్న ఎద్దులను , కాపరులతో ఉన్నను లేక పొలము నందు ప్రవేశించి నస్యములను తినుచున్నను వానిని దండింపరాదు.


 *  గోవుల పైన కూర్చుని స్వారి చేయరాదు . కాని బండికి కట్టవచ్చు.


 *  ఎవడు జంతువులను కట్టుట, చంపుట, వంచుట చేయుటకు ఇష్టపడడో అతడు సకల భూతములకు హితము గోరువాడు ఎల్లప్పుడూ తరగని మోక్షరూపం అగు ఆనందమును పొందును.


 *  బ్రాహ్మణుల గోవులను అపహరించినప్పుడు , గొడ్డుటావులతో బరువులు మోయించుటకై ముక్కుత్రాడు వేసినప్పుడు , యాగముల కొరకు పశువులను అపహరించినప్పుడు వెంటనే అపహరించినవాని కాలు సగము నరికివేయవలెను .


 *  మార్గములో గ్రామ సమీపేతర ప్రదేశమునందలి పొలములలో గోవులు మేసినచో  కాపరి కి జరిమానా వేయవలెను . తరువాత గోవులు తినిన మేతఫలమును కాపరి గాని , యజమానిగాని పొలము యజమాని కి ఇవ్వవలెను.


 *  వెంటనే ఊడ్చుట, గోమయముతో అలుకుట , గోమూత్రము మున్నగునవి చల్లుట , పైమట్టి ఎత్తి తవ్వి ఎత్తిపోయుట , గోవుని ఒక రాత్రి , ఒక పగలు కట్టివేయుట  ఈ అయిదింటిచేత భూమి పరిశుద్ధతనొందును.


 *  వర్షం కురియుట వలన నేలను చేరునవి , పశువుల తాగగానే దప్పిక తీరునవి , గంధము , రసము , రంగు వానితో కూడిన ఉదకములు అనగా నీళ్లు పరిశుద్ధములు.


 *  సకల జంతువుల ప్రాణ సంరక్షణార్థమై రాత్రిగాని , పగలుగాని ఎల్లప్పుడూ తన శరీరముకు కష్టం కలిగినను భూమిని చూచుచు  నడవవలెను .


 *  ఒక గ్రామము చుట్టును నూరు ధనువులంతా ( ధనువు అనగా నాలుగు మూరలు ) ప్రదేశము పశువుల మేతకును , గాలి మొదలగు వీచుటకు భూమి బీడుగా వదలవలెను. పట్టణం అయినచో దీనికి మూడురెట్లు ప్రదేశం బీడుగా వదలవలెను .


 *  పైన చెప్పిన బీడు భూమి చుట్టూ ఆవరణ లేక పైరు సరిగ్గా లేని స్థలము నందు గోవు మేసిన యెడల ఆ కాపరిని గాని , యజమానిని గాని దండించరాదు.


 *  పశువుల మేయు బీడు భూమి చుట్టు నుండు ఆవరణ ఒంటెలు తలయెత్తి చూచిన లోపలి ప్రదేశము కనపడని యంతఎత్తున చుట్టూ రక్షణ ఏర్పరచవలెను . కుక్కలు , పందులు లోపల దూరకుండా కిందవైపు సందులను మూయవలెను .


 *  గ్రామసమీపాన దారికి దగ్గరగా ఉండు చుట్టూ వేసిన ఆవరణలో గోవులు దూరి మేసినచో ఆ గోవుని దండింపక గోపాలకునికి జరిమానా విధించవలెను .


 *  ఎండకాయుచున్నను , వర్షం కురియుచున్నను , ముందుగా శక్తికొలది గోవులను సంరక్షించిన తరువాతయే తన్ను రక్షించుకొనవలెను .


 *  గోవును దర్భ తాళ్లతో , రెల్లు తాళ్లతో దక్షిణాభిముఖముగా కట్టివేయవలెను . ఈ తాళ్లకు నిప్పు అంటుకొని కాలిపోయినను గోవు చిన్న గాయాలతో బయటపడును . కట్టివేసినప్పుడు గోవు అగ్నిచేత దగ్ధం అయినపుడు ప్రాయశ్చిత్తం ఏమియును లేదు .


 *  రాజ్యము నందు గోవులు దీనంగా ఉన్నయెడల రాజులకు అశుభం. కాళ్లతో భూమిని గోకిన రోగములు సంభవించును . కనుల నుంచి నీరు కార్చుచున్న మృత్యువు కలుగును. యజమాని చూచి భయపడి అరిచినచో దొంగలు వస్తారు.


 *  కారణం లేకుండా గోవు అరుచుచున్న అనర్థం కలుగును. రాత్రివేళ అయినచో భయం కొరకగును. ఎద్దు అరిచినచొ శుభం కలుగును. ఈగలచే గాని , కుక్కలచేగాని మిక్కిలి విరుద్ధమై అరిచినచో వెంటనే వర్షం కురియును.


 *  గోవులు అంబా అనుచూ ఇంటికి వచ్చిన గోశాల వృద్ది అగును. గోవులను సేవించుచూ వచ్చిననను గోశాల వృద్ది అగును. తడిసిన అవయవములతో గాని , నిక్కబొడిచిన వెంట్రుకలతో గాని సంతసించుచూ వచ్చిన గోవులు మంచివి. ఈ రీతినే గేదెలు కూడా ఉండును .


 *  చూలుతో ఉన్నట్టియు, తగిన వెలకు దొరికినట్టియు , దానము వలన దొరికినట్టియు , కూలి సొమ్ముల వలన దొరికినట్టియు , యుద్ధాదులలో గెలిచి తెచ్చినవియు , ఇంటబుట్టినవియు , ఏదేని వ్యాధిచే యజమాని వలన విడకాబడినవియు , తానుపోషించునవియగు గోవులు మిక్కిలి మంచివి.


 *  దూడలేని ఆవుపాలు , గర్భముతో ఉన్న గోవుని పితకరాదు. ఈనిన పది దినముల వరకు పాలు పితికినవాడు నరకమునకు పోవును .


 *  బలం లేనిదియు , వ్యాధిగ్రస్తం అయినదియు , పొర్లినదియు , కవల దూడలు పెట్టినదియు అగు గోవు పాలు పితకరాదు .


 *  పుట్టిన రెండు నెలల వరకు దూడను తీయకుండానే పాలు పితకవలెను . మూడొవ నెలలో రెండు చన్నులు దూడకు వదిలి రెండు చన్నులు పితకవలెను. నాలుగొవ నెలలో మూఁడు భాగములు యజమాని తీసుకుని ఒక భాగము దూడకు విడిచిపెట్టవలెను . అటు తరువాత పశువు యొక్క బలాబలాలను బట్టి పాలు తీసుకొనుట మంచిది .


 *  ఆషాడ పౌర్ణమి, ఆశ్వయుజ పౌర్ణమి, పుష్యపౌర్ణమి , మాఘపౌర్ణముల యందు పాలు పితకక దూడలకు వదలవలెను .


                              సమాప్తం 


 


   గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: