3, ఏప్రిల్ 2021, శనివారం

ఎదురు దుశ్శకునం కాదు

 *#ఒంటి బ్రాహ్మణుని #ఎదురు దుశ్శకునం కాదు*


#ఆమధ్య ఒక పెద్దమనిషి ఇంటిలోంచి బయటకు వెల్తున్నాడు, ఒక బ్రాహ్మణ కులస్థుడు ఎదురు పడ్డాడు. "బ్రాహ్మణుడి ఎదురేంటిరా బాబూ ఇయ్యేల" అంటూ మళ్లీ వెనక్కి ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఊరి పెద్ద అక్కడే ఉండడం తటస్థించింది. ఆయన మామూలుగా ఆ ఎదురు శంక లేకుండా హాయిగా బయటకు వెళ్లేరు. తరువాత ఆ పెద్దమనిషి అదేంటండీ బ్రాహ్మణుని ఎదురు మంచి శకునం కాదు అంటారు కదా. మీరేమిటి గమనించలేదా అని అడిగాడు.  అప్పుడు ఆయనను స్థిమితంగా కూర్చోబెట్టి ఊరి పెద్ద ఆయనకు ఏం చెప్పేరంటే...


చాలామందికి ఈ అపోహ ఉంది. ఇదే విషయాన్ని నేను లోగడ ఒక వైష్ణవ పండితుని అడిగేను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు సముచితంగా తోచింది.  


ఒంటి బ్రాహ్మణుడు కాదు. ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పూర్వం గురుకులాలలో ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యనభ్యసిస్తున్న బ్రహ్మచారుల ను బిక్షాటనకు పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోని గృహాల నుండి బిక్ష సేకరించేవారు.  అటువంటి బ్రహ్మచారి ఎదురయితే ఆయనను సాదరంగా ఆహ్వానించి బిక్షవేసి సాగనంపాలి. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురయి నప్పుడు ఆయనను నిర్లక్ష్యంచేసి బిక్ష వెయ్యకుండా ఇంటినుండి బయటకు వెళ్లడం మంచి పనికాదు అని దాని పరమార్థము.


ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వారు ఏదో సమావేశానికో, చర్చలకో వెళ్తూన్నారని అర్ధం.    


ఈ రోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు. గురుకులాలు అంతకన్నా లేవు. అందుచే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు. 


ధర్మ ము అంటూ ఎవరయినా ఎదురయితే అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడవనీయండి వీలయితే అతనికి మీకు చేతనైన సహయము  చేసి కదలండి. మీరనుకున్న కార్యం దిగ్విజయంగా నెరవేరుతుంది. సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన జ్ఞానమెంత. 


ఒకవేళ ఏదైనా కారణం ఉన్నప్పటికి అది ఆసమయంలో అప్పుడున్న పరిస్థితులకు అనువుగా పెట్టుకున్నవి అయి ఉంటాయి. అది ఈ రోజులలో వర్తించదు." అని ముగించారు. 


*ఇటువంటి అప-ఊహలను (అపోహలను) సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి👨🍃

కామెంట్‌లు లేవు: