8, ఫిబ్రవరి 2022, మంగళవారం

కావ్యము

 శ్లోకం:☝️

   *ఏకస్య తిష్టతి*

*కవేర్గృహ ఏవ కావ్యం*

   *అన్యస్య గచ్ఛతి*

*సుహృద్భవనాని యావత్ |*

   *న్యస్యా విదగ్ధ*

*వదనేషు పదాని శశ్వత్*

   *కస్యాపి సంచరతి*

*విశ్వకుతూహలీవ ||*


భావం: ఒకానొక కవి చేయు కావ్యము (అతని దురదృష్టము వలన వ్యాపింపక) అతని ఇంటియందే యుండును.

ఇంకొకని కావ్యము ఆతని స్నేహితుల ఇళ్ల వరకు పోగలుగును. అంటే కేవలం అతని స్నేహితులు మాత్రమే ఆస్వాదించగలుగుతారు.

మరొక కవియొక్క కృతి ప్రపంచమంతయు సంచరించు కోరికయున్నట్టు, రసికులు సరసులందరి ముఖాలలోను ప్రవేశించును. దేశవిదేశాలలోని జనాలంతా ఆ కావ్యమును ఆదరిస్తారని, ఆస్వాదిస్తారని  భావం.🙏

కామెంట్‌లు లేవు: