6, నవంబర్ 2022, ఆదివారం

చిన్నపిల్లల అనారోగ్య ఔషధ యోగాలు

 చిన్నపిల్లల అనారోగ్య నివారణ కొరకు ఔషధ యోగాలు - 2 . 


 * చిన్నపిల్లలకు మూత్రము బంధించిన - 


    నిమ్మగింజలను నూరి బొడ్డుపైన పట్టు వేసి చన్నీళ్ళను పైనుంచి ధారగా పోయుచున్న చిన్నపిల్లలకు మూత్రము ధారాళముగా వెడలును . 


 *  చిన్నపిల్లలు పాలు కక్కుచున్న - 


      చిన్నపిల్లలకు పాలు ఇచ్చుటకు ముందు , ఇచ్చిన తరువాత కొంతసేపటికి నాలుగైదు చుక్కల నిమ్మకాయ రసం తాగించుచుండిన త్వరలొనే పాలు కక్కు సమస్య తగ్గును . 


 *  చిన్నపిల్లల లివర్ మరియు స్ప్లీన్ సమస్యల నివారణ కొరకు - 


     నీరుల్లిపాయలను (onion ) దారముతో గుచ్చి చిన్నపిల్లల మెడలో కట్టుచుండిన లివర్ మరియు స్ప్లీన్ సమస్యల నుంచి బయటపడుదురు . 


 *  చిన్నపిల్లల దగ్గు హరించుట - 


     దానిమ్మ బెరడు , ఉప్పు కలిపి నూరి కందిగింజ అంత మాత్ర తేనెతో నూరి నాకించుచుండిన చిన్నపిల్లల దగ్గు నివారణ అగును . 


 *  ఎక్కిళ్లు నివారణ కొరకు - 


      కుంకుడు కాయకు రంధ్రము చేసి దారంతో గుచ్చి పిల్లల కంఠము నందు మాలగా వేసిన దృష్టిదోషము వలన కలిగిన ఎక్కిళ్లు నివారణ అగును . 


             కొబ్బరికోరు పావుతులం , పటికబెల్లం పొడి పావుతులం కలిపి తినిపించుచుండిన పిల్లలకు వచ్చు ఎక్కిళ్ళు నివారణ అగును .


 *  పిల్లలకు బాన పొట్ట నివారణ - 


     పిల్లలకు పొట్ట పెద్దగా అయినపుడు రోజూ ఒక వెల్లుల్లిపాయ తినిపించుచుండిన యెడల ఊదర పొట్ట హరించును . 


 *  చిన్నపిల్లల కోరింత దగ్గు హరించుట కొరకు - 


     అరటిఆకులను మాడ్చి భస్మము చేసి ఆ భస్మమును మూడు పర్యాయములు ఒక చిటికెడు తేనెతో కలిపి నాకించుచున్న ఎటువంటి కొరింత దగ్గు అయిన నివారణ అగును . 


     మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


కామెంట్‌లు లేవు: