16, జనవరి 2023, సోమవారం

అరుణాచలశివ

 అరుణాచలం ఈ పేరే ఒక మాయ ఒక అద్భుతం అక్కడికి వెళ్లినవారికి ఏమవుతుందనేది తెలియదు కానీ ఆ కొండ అయస్కాంత శక్తిలాగా లాగేస్తుంది అక్కడే ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది. మనసు అరుణాచలశివ అంటూ ధ్యానం చేస్తుంటుంది, ఆ గిరి 260 కోట్ల సంవత్సరములుగా ఉంది అని పురావాస్తు శాఖ వారు నిర్ధారించారు.. ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు సాక్షాత్తు స్వామి అమ్మవారు అర్ధనారీశ్వరరూపంలో ఉన్నారు అక్కడ, మనం అక్కడ అప్రయత్నంగానే ధ్యానంలోకి  వెళ్లిపోతాము సమయం తెలియకుండా ఎంత సేపయినా అలా ధ్యానంలో ఉండిపోవచ్చు, భవబంధాలు గుర్తుకు రావు, బాహ్యసృహా ఉండదు. అలా ధ్యానంలో ఉన్న సమయంలో ఎందరో సిద్ధులు, అక్కడ సంచరిస్తున్న ఆశరీరుల దర్శనం, వారి వాక్కు కూడా మన మనో చక్షువులచే వినవచ్చు .


 ఆ స్థలంకి ఉన్న శక్తి అలాంటిది. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, మనస్సును ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోతుంది అక్కడి వాతావరణం, అన్నీ మర్చిపోయి అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము.. ఆ మాయ ఎప్పటికి వదలదు , మాయ అని ఎందుకు అంటున్నాను అంటే అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగు పెట్టాక మర్చిపోతాము, అరుణాచలంలో అడుగు పెట్టాక అక్కడి నుండి జీవితం కొత్తగా మొదలు అవుతుంది అదే మెదలు అదే చివర అనే ధ్యాసకు లోనవుతుంది మనసు, అంతే ఆ మాయలో జీవితకాలం మొత్తం కూడా గడిచిపోవచ్చు.. 


ఎందరో నాస్తికులు కూడా కుతూహలంతో ఆ గిరి ప్రదక్షిణ చేసి అక్కడ ఏదో మాయ ఒక మహా శక్తిలాగా మనసులాగేస్తుందని అని కారణం తెలియని ఆనందాన్ని పొందుతామని చెప్పిన సంఘటనలు ఉన్నాయి , దేవుడికి దండం పెట్టని వారు కూడా దాసోహం అంటూ ఆ కొండ చుట్టూ పడి దొర్లేస్తారు ఆ స్వామి కరుణామయుడు నాస్తికులకే అంత అనుభూతి కలిగితే భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది అడుగడుగునా శివ దర్శనం నిదర్శనం కనపడుతూనే ఉంటుంది.. 




ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను �

కామెంట్‌లు లేవు: