14, జులై 2023, శుక్రవారం

సమయపాలన

 సమయపాలన...

పరమాచార్య వారు ఆకలికి, నిద్రకు సమయం కేటాయించరు. కానీ వారిని సేవించే శిష్యులకు అలా వీలుపడదు.ఒక్కోసారి సాయంత్రం నాలుగు గంటలు దాటినా భిక్ష స్వీకరించరు. భక్తులకు దర్శనం ఇస్తూనే ఉంటారు. కానీ శిష్యుల పరిస్థితి వేరు. వారికి ఆకలి దంచేస్తున్నా ఆ విషయం వారి దృష్టికి తీసుకొని వెళ్ళలేరు.

ఒక చురుకైన శిష్యుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం కనిపెట్టాడు. స్వామి వారి గదిలో ఒక గడియారం ఉండేది. వారు అవసరమైనప్పుడు ఆ గడియారం లో టైమ్ చూసేవారు.ఈ చురుకైన శిష్యుడు రహస్యం గా గడియారం ముల్లును 3.30ని. ల నుంచి 4.30 ని. మార్చి ఏమి తెలియనట్లు మరల సేవలో నిమగ్నమైనాడు.

ఇంతలో ఒకరోజు స్వామి వారి భక్తుడు దర్శనానికి వచ్చి స్వామి ని అపర పరమేశ్వరునిగా స్తుతించాడు. స్వామి

"అలాంటిదేమి లేదు.మీరన్నట్లు నాకెలాంటి శక్తులు లేవు.ఆ శక్తులే ఉంటే నా గదిలో గడియారం గంట ముందు పోతుంటే ఆపగలిగే వాణ్ణి గదా."అన్నారు.

స్వామి వారి నిజమైన శక్తి తెలుసు కున్న ఆ శిష్యుడు వారి పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నాడు.

స్వామి "అయ్యో లే. మీకు ఆకలవుతున్న దన్న విషయం తెలియకుండా పోయింది."అని నొచ్చుకున్నారు.

***పరమాచార్య వారిని ఎవరు ఏమార్చలేరు. వారి ధర్మం నుండి ఎవరు మరల్చలేరు.

కామెంట్‌లు లేవు: