14, జులై 2023, శుక్రవారం

నిత్యజీవితం సాఫీగా కొనసాగాలంటే

 *మన నిత్యజీవితం సాఫీగా కొనసాగాలంటే ఏమి చేయాలి???*


"కోపం, అసూయ, ద్వేషం, అసహనం, చికాకు, మోహం వంటి గుణాలకు మనసులో కొనసాగే ఆలోచనలు కారణం అవుతున్నాయి"...

అందుకే అవి మనను బాధిస్తున్నాయి. 

మన ప్రతి ఆలోచన మనలో కలిగే కోరికకు అనుగుణంగా మన జ్ఞాపకాల పరిధిలోనే ఉంటుంది. 

కేవలం మనకు వచ్చే ఆలోచనలనే,  మనం మనసని అనుకుంటున్నాం. 

ఆ ఆలోచనలకు కారణమైన జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలకు కారణమైన కోరికలు, ఆలోచనలకు ఫలంగా లభించే సుఖ -దుఃఖాలు అన్నీ కలిపితేనే మన మనసు...


సాధారణంగా సాగే ఆలోచనలు మనను ఇబ్బంది పెట్టటంలేదు, చేస్తున్న పనికి అంతరాయం కలిగించే ఆలోచనలే మనల్ని బాధపెడుతున్నాయి. 


మనం ఆలోచనల నుండి బయటపడాలని ప్రయత్నం చేస్తుంటాం. 

ఆలోచన స్వరూపాన్ని అర్ధం చేసుకునేందుకు కారణాలు విశ్లేషించుకుంటే తప్ప వాటి నుండి పూర్తిగా బయటపడలేం.


మనకు నిజానికి ఆలోచనలవల్ల బాధ రావటం లేదు. 

ఆ ఆలోచనతో పాటు మనలో కలిగే గుణాల వలనే బాధ కలుగుతుంది. 

ఆ గుణాలే.. కోపం, అసూయ, ద్వేషం, అసహనం, చికాకు, మోహం. 

"ముందుగా వీటి నుండి బయటపడాలి !" అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది...


                *_🪷శుభమస్తు🪷_*

  *🙏 లోకా:సమస్త సుఖినోభవంతు.🙏*

కామెంట్‌లు లేవు: