28, జులై 2023, శుక్రవారం

ఐదులక్షణములు ముఖ్యము

 శ్లో. కాకస్నానం బకధ్యానం 

     శ్వాననిద్రా తథైవచ 

     అల్పాహారీ గృహత్యాగీ 

     విద్యార్థీ పంచలక్షణం


తా౹౹ విద్యార్థికి. ఈక్రింద చెప్పేటువంటి ఐదులక్షణములు ముఖ్యము ఉండవలెను .

1,కాకి నీటిలో ఒకసారి మునిగిలేచినంతమాత్రంచేతనే స్నానంపూర్తిచేస్తుంది అలాగే విద్యార్థికూడా క్షణమాత్రముననే స్నానంముగించవలెను.


2. కొంగవంటి తపస్సు చేయాలి అంటే మాలికాదులతో దీర్ఝకాలికమైన జపములుకూడదని అర్థం. 

కొంగ ఆలోచన చేస్తున్నాకూడా కొంచేంపరధ్యాసతో ఉంటుంది అలాగే విద్యార్థిగూడా చదువుయందు ముఖ్యమైనధ్యాసతోఉండవలెను. పరధ్యానం ఉండకూడదు


3, గాఢనిద్రకు ఉపక్రమించకుండా కుక్కవలె ఎల్లప్పుడూ చదువుపట్ల మెలకువగా ఉండవలెను.


4 మితముగాఆహారంతీసుకొనవలెను లేకపోతే మృష్టాన్నంతీసు కున్నయెడల నిద్రదరిచేరి బుధ్ధిమందగించి 

పాఠములుఒంటబట్టక సాధనచేయలేక పట్టభద్రులు అవలేక సోమరిపోతులు అగుప్రమాదముఉన్నది.


5, ఇది తల్లిదండ్రులు పిల్లలు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైనవిషయం పిల్లవాడుచదువుపూర్తిఅగునంతవరకు వానియందు అతిమమకారం చూపకూడదు వానిదృష్టి ఎల్లప్పుడూ గురువు .చదువు ఈరెంటియందుమాత్రమే ఉండేటట్టు తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని గురువులకుసహకరించవలెను.

విద్యార్థిగూడా గృహమందు ఉన్నజనులపట్లకాక కేవలం తను గురువుగారిదగ్గరనేర్చుకొనుచున్న పాఠములను మరలామరలా చదువుచూ తోటివారితో ఆపాఠములయందునేర్చుకోవలసిన మెళుకువలు గురించే మమకారంఏర్పరుచుకొనవలెను .

సారాంశం .. 

ఈఐదు లక్షణములు విద్యార్థి అలవరచుకుంటే సంప్రదాయమైన విద్య ,వినయం, నైతికవిలువలు ,అబ్బి తానుఎంచుకున్న విద్య పూర్తిచేసి కృతకృత్యుడు అయి భావితర విద్యార్థులకు ఆదర్శప్రాయుడౌతాడు.

కామెంట్‌లు లేవు: