21, ఆగస్టు 2023, సోమవారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 18*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 18*


 *సాధన లక్ష్యం....*


బాహ్యంగా నరేంద్రుడు వేడుకలు, వినోదాలు, సంగీత వ్యాయామాదులలో కాలం గడుపుతున్నప్పటికీ, అంతరికంగా అతడి మనస్సు ఇలా ధ్యానం ద్వారా సత్యాన్ని అన్వేషించసాగింది. 'ఈ లోకాన్ని సృజించి, పరి 

రక్షించే పనులు నిర్వహించే ఒక శక్తి ఉండివుంటే, ఎందరో మహాత్ములు దర్శించి, పూజించి, స్తుతించడం నిజమే అయితే, సత్యాన్ని, ఆ శక్తిని తాను కూడా దర్శించుకోవాలి' అనే తలంపు అతడిలో తీవ్రతరం మయింది. 


ముఖాముఖి దర్శనం కన్నా మరెలాంటి ఋజువూ అతణ్ణి తృప్తిపరచేదిగా లేదు. అలా అయితే ఆ సత్యాన్ని దర్శించాలి. 


అందుకు మొదట అవసరమైనది తగిన అర్హత.


ఆ అర్హతలు.. 


"తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం (కర్మ ఫలాలను ఈశ్వరునికి అర్పించడం) - ఈ మూడు క్రియాయోగం" అంటున్నది పతంజలి యోగ సూత్రం. ' దీన్లో తపస్సే అన్నింటికీ ఆధారం. తపస్సు అంటే దగ్ధం అని అర్థం.


దేనిని దగ్ధం చేయాలి? మన లౌకిక వాంఛలను, ఇంద్రియాల ఉద్వేగాన్ని, దుర్గుణాలను దగ్ధం చేయడమే తపస్సు. 


దీనికి పునాదియైనది బ్రహ్మచర్యం. కామశక్తిని అధోముఖంగా పోనివ్వకుండా అడ్డుకోవడమే బ్రహ్మచర్యపు ముఖ్య కర్తవ్యం. కామమార్గంలో పోకుండా ఉండడమే గొప్ప తపస్సుగా పరిగణింపబడుతున్నది.


స్వాధ్యాయం లేక ఆత్మవిచారణ మూలంగా ఈ కామశక్తి ఉదాత్త లక్ష్యాన్ని చేరుకొంటుంది. తపస్సు మూలంగా పవిత్రమైన, స్వాధ్యాయం మూలంగా ఉదా లక్ష్యాన్ని చేరుకొన్న కామశక్తి సత్యస్వరూపుడైన భగవంతుని అభి ముఖంగా నిర్దేశింపబడినప్పుడు, అది సత్యాన్ని పొందే పథంలోకి సాధకుణ్ణి చేరుస్తుంది. నరేంద్రునికి ఈ మూడు స్వతఃసిద్ధంగానే కరతలామలకమని చూస్తున్నాం.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: