21, ఆగస్టు 2023, సోమవారం

శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం.

 🕉 మన గుడి 




⚜ బీహార్ : బక్సర్


⚜ శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం. 


💠 ప్రతి గుడిలో ఒక రాతి విగ్రహం ఉంటుంది, కానీ ఆ విగ్రహం మాట్లాడుతుందని చెబితే, బహుశా మీరు నమ్మరు. అయితే అటువంటి దేవత ఆలయం ఉందని, ఇక్కడ విగ్రహం రాతితో చేసినప్పటికీ దాని నుండి శబ్దాలు వస్తాయని  తెలుసా ! అవును, మీరు దీనిని మూఢ నమ్మకంగా పరిగణించవచ్చు  కానీ ఇది ఖచ్చితంగా నిజం. 

మనం అన్నింటినీ తిరస్కరించవచ్చు కానీ దేవి మరియు దేవతల ఉనికిని మరియు వారి శక్తిని తిరస్కరించలేము. 

దీని వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసినా అక్కడ ఏం జరుగుతోంది అనేది అంతుపట్టకుండా ఇప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి. 

అలాంటి ఆలయాల్లో ఒకటి  బీహార్ రాజధాని పాట్నా బక్సర్లో ఉన్న రాజేశ్వరీ ఆలయం. 


🔅 ఊరి పేరు వెనక ఉన్న చరిత్ర 🔅


💠 పూర్వం ఈ ప్రాంతంలో ఒక ఋషి, మహిమాన్వితుడు అయిన దుర్వాస మహర్షి మీద అసూయతో ధ్యానం చేసుకుంటున్న దుర్వాస మహర్షిని భయపెట్టి, ఆయన ధ్యాననిష్టని చెడగొట్టాలని క్రూర మనస్తత్వంతో తనను తాను కామరూప విద్యతో పులిగా మారి దూర్వాస మహర్షిని భయపెట్టాలి అని అతని మీదకు వెళ్ళాడు.

తపస్సులో ఉన్న దూర్వాస మహర్షికి  దివ్య దృష్టితో ఈ విషయం తెలిసి పులి రూపంలో వచ్చిన ఆ ఋషిని అదే పులి రూపంలో జీవితాంతం ఉండిపోయేలా శపించాడు.


💠 తన తప్పు తెలుసుకున్న ఆ ఋషి క్షమించమని ఎన్నో విధాల దుర్వాస మహర్షి  కాళ్లపై పడి ప్రార్థించగా చివరికి శాంతించిన దూర్వాస మహర్షి కొన్ని సంవత్సరాలు ఇదే ప్రాంతంలో ఉన్న సరస్సులో రెండు పూటలా స్నానం చేసి ఇక్కడ వెలసియున్న అమ్మవారికి భక్తి పూర్వకంగా ఆరాధించమని చెప్పి, పుష్కరకాలం( 12 సంవత్సరాలు) తర్వాత తన నిజరూపం తనకు వస్తుంది అని శాప విమోచనం చెప్పి అనుగ్రహించాడు.


💠 అలా ఆ ఋషి నిత్యము ఈ సరస్సులో స్నానం చేసి తన నిజరూపం పొందాడు కనుక ఈ సరస్సును వ్యాఘ్ర సరస్ ,బాగ్ సరస్ ( బాగ్ అనగా హిందీలో పులి) అనే పేరు వచ్చింది.

అదే క్రమంగా బక్సర్ అయింది. భస్తర్ అని కూడా పిలుస్తారు.


🔅 ఆలయ రహస్యం 🔅


💠 రాజరాజేశ్వరి ఆలయ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు మాట్లాడతారని ప్రసిద్ధి.

అంటే ఏ మనిషికో పూని మాట్లాడటం కాదు స్వయంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపిస్తుంటాయి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100 శాతం నిజమే.


💠 స్థానికుల అభిప్రాయం ప్రకారం, ప్రతి అమావాస్య, పూర్ణిమ మరియు నవరాత్రి రోజులలో ఆలయ తలుపులు మూసివేసిన తర్వాత అమ్మవారి విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి.

ఈ విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఒక్కసారి కాదు.. చాలాసార్లు ఈ రహస్యం  ఛేదించేందుకు ప్రయత్నించారు. 

ఇందుకోసం శాస్త్రవేత్తలు ఆలయంలో అనేక ఆధునిక యంత్రాలను అమర్చారు.  కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

చివరికి శాస్త్రవేత్తలు కూడా ఆలయం లోపల నుండి వచ్చే రహస్య ధ్వనిని ధృవీకరించారు.


💠 400 ఏళ్లక్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు. తాంత్రిక శక్తులను పొందడానికి, తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 

ఈ ఆలయంలో తరతరాలుగా తాంత్రిక భవానీ మిశ్రా వంశస్తులే  పూజారులుగా ఉన్నారు.  

ఓ నాటి అర్ధరాత్రి పూట గుడిలోకి వెళ్ళి చూడగా వారికి కూడా కొన్ని శబ్దాలు వినపడుతున్నట్టు ధ్రువీకరించారు, అమ్మవారి విగ్రహం నుండి ఏవో తెలియని శబ్దాలు(అర్ధం కానీ మాటలు)వినిపిస్తున్నాయి, కానీ వాటి భావం మాత్రం అంతుపట్టడం లేదని వారు అంటున్నారు.


 💠 తాంత్రికమైన పూజలు, శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ క్షుద్ర పూజలు జరుపుతారన్న వాదన వినిపిస్తోంది. 

ముఖ్యంగా అమావాస్య, పౌర్ణిమ తదితర రోజుల్లో ఆ పూజలు చాలా ఎక్కువగా జరుగుతాయని చెబుతారు.


💠 అందువల్లే రాత్రి సమయంలోనే కాదు పగలు కూడా ఈ దేవాలయానికి వెళ్లడానికి చాలా మంది భయపడేవారు.

అయితే పగలు మాత్రం ఇక్కడ పూజరులు పూజలు నిర్వహిస్తారు.

ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఆ ఆలయం.. రాత్రి వేళల్లో మాత్రం గుండె దడ పెంచుతుంది.


💠 ఈ ఆలయంలో దశ మహా విద్యల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి:   కాళి, త్రిపుర భైరవి, ధూమావతి, తార, చిన్నమస్తక, షోడసి, మాతంగి, కమల, ఉగ్రతార మరియు భువనేశ్వరి విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. 

ఈ దేవతలందరూ తాంత్రికుల దేవతలు. 


💠 ఇవే కాకుండా, బగ్లాముఖి మాత, దత్తాత్రేయ భైరవుడు, బతుక్ భైరవుడు, అన్నపూర్ణ భైరవుడు, కాలభైరవుడు మరియు మాతంగి భైరవ విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్టించబడ్డాయి.


💠 చాలా ఏళ్లుగా ఆ దేవతను ఆరాధిస్తున్న వారు చెప్పే వివరాల ప్రకారం క్షుద్ర పూజలు చేసేవారితో అమ్మవారు మాట్లాడుతారని చెబుతారు. అది కూడా అర్థ రాత్రి తర్వాత మాత్రమే ఈ సంభాషణ జరుగుతుందని వారు చెబుతారు.

కేవలం పూజారులే కాకుండా కొంతమంది భక్తులకు కూడా ఆ మాటలు వినిపించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.వీరిలో చాలా మంది అమావాస్య వంటి సందర్భాల్లో జన్మించిన వారేనని స్థానికులు చెబుతారు.

కామెంట్‌లు లేవు: