7, ఆగస్టు 2023, సోమవారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 4*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 4*


ఏడేళ్ళ వయసులో ఆంతరిక చైతన్యంలో లయించి పోవటం బహుజన్మల తపో ఫలం...


బాల్యంలోనే భక్తిబీజాలు నరేంద్రుడి హృదయంలో దృఢంగా నాటుకున్నాయి. శ్రీరాముడి దివ్య చరిత్ర  ఆకర్షించగా సీతారాముల విగ్రహాలను   ఒక చోట అమర్చి  ధ్యానించసాగాడు. చాలాసేపటి దాకా కనబడకపోవటంతో వెదుకనారంభించారు. అనేక చోట్ల వెదకిన తరువాత మేడమీద గది మూసి ఉండడం చూసి తలుపు గట్టిగా కొట్టిన జవాబు రాకపోయేసరికి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు.

నరేంద్రుడు నిశ్చలధ్యానమగ్నుడై కనిపించాడు. 


కాషాయాంబరాలు ధరించిన సాధువులు నరేంద్రుణ్ణి అమితంగా ఆకర్షించారు. చేతికి అందిన వస్తువులన్నీ వారికి ఇచ్చేసేవాడు.


ఎవరో వివాహం అనర్థాహేతువని నిరసిస్తూ సంసారయాతనలు దుర్భరాలని అనటం నరేంద్రుడు విని భయకంపితుడైనాడు. "వివాహమే యిన్ని బాధలకూ మూలమైతే, దేవుడెందుకు వివాహమాడాలి?" అని వితర్కించుకొని, సీతారాముల విగ్రహాలను ఆవలవేసి ఆ చోట శివుణ్ణి ప్రతిష్ఠించాడు.


సీతారాముల విగ్రహాన్ని విసిరివేసినప్పటికీ రామాయణం పట్లా, సీతా రాముల ఆదర్శాలపట్లా, ఆంజనేయస్వామి పట్ల ఉన్న గాఢాభిమానం మాత్రం చెక్కుచెదరలేదు.


దేవుళ్లందరిలో నరేంద్రునికి బాగా నచ్చిన దేవుడు పరమశివుడు. సర్వసంగ పరిత్యాగం చేసి మూర్తీభవించిన త్యాగమూర్తిగా ఆయన కొలువుదీరి ఉండడం అతడి మనస్సును అమితంగా ఆకట్టుకొంది. కొన్ని సమయాల్లో అతడు కూడా బట్టలన్నీ విప్పేసి కౌపీనధారియై తిరిగే వాడు. ఈ చర్య భువనేశ్వరి మనస్సులో తెలియరాని ఏదో దిగులు పుట్టించేది. 'ఇతడు కూడా తాత మాదిరే సన్న్యాసం పుచ్చుకొంటాడేమో!' అని ఆందోళనపడేది. 


"నరేన్, ఏమిటిది? ఇదేం వేషం?" అని అడిగేది. "నేను శివుణ్ణయిపోయాను, చూడు, నేను శివుణ్ణయిపోయాను. నేనే శివుణ్ణి" అనేవాడు నరేన్. అతడు తెలిసి చెప్పాడో, తెలియక చెప్పాడో! కాని అత్యున్నత మానసిక స్థితిలో ఉచ్చరించే మంత్రమైన 'శివోహం'ను (నేనే శివుణ్ణి) పసితనంలోనే ఉచ్చరించాడు నరేంద్రుడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: